మా ఫ్యామిలీపై ఆరు సార్లు, బాధించింది.... బాలయ్య తెలియదు వివాదంపై నాగబాబు మరో సంచలనం!

Recommended Video

Naga Babu Responds on Balakrishna's Second Comment on Pawan Kalyan - Chiranjeevi

బాలకృష్ణ ఎవరో తెలియదు అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఎట్టకేలకు నాగబాబు స్పందించారు. తాను అలా ఎందుకు అనాల్సి వచ్చిందో ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు.

'హలో ఫ్రెండ్స్.. గత కొంతకాలంగా నేను ఒక వ్యక్తి మీద చేస్తున్న కామెంట్స్ చాలా వివాదాస్పదంగా ఉన్నాయని చాలా మంది అంటున్నారు, ఈ విషయంలో నాపై విమర్శలు కూడా వచ్చాయి. దానికి నేను సమాధానం చెప్పాల్సిన అసవరం ఏర్పడింది.'' అంటూ నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.

కారణం ఉంది కాబట్టే అలా అన్నాను

కారణం ఉంది కాబట్టే అలా అన్నాను

వాస్తవానికి నేను ఇలాంటి వివాదాల జోలికి వెళ్లను. వీటి ద్వారా ఫోకస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నాకు ఉన్న గుర్తింపు, పేరు చాలు. వాటి కోసం ఎప్పుడూ పరుగుపెట్టలేదు. నేను చేసిన ఆ కామెంటుకు ఒక కారనం ఉందని నాగబాబు తెలిపారు.

అతడు మా ఫ్యామిలీ మీద ఆరు సార్లు కామెంట్ చేశాడు

అతడు మా ఫ్యామిలీ మీద ఆరు సార్లు కామెంట్ చేశాడు

‘గతంలో అతడు పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు అన్నాడు కాబట్టి కౌంటర్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారు. ఒక మాటకే అంత ఫీలైపోతే ఎలా? అని నన్ను తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఇచ్చారు సరే.. మళ్లీ ఎందుకు కౌంటర్ ఇవ్వాలి అని ఇంకొందరు అంటున్నారు... అలా అంటున్న వారికి నా సమాధానం ఒకటే. ‘‘ఆ వ్యక్తి(బాలకృష్ణ) ఇప్పటికి ఆరు సార్లు మా ఫ్యామిలీ మీద, మా అన్నదమ్ముల మీద కామెంట్ చేశారు'' అందుకే ఆ కౌంటర్ ఇచ్చానని నాగబాబు స్పష్టం చేశారు.

వంద శాతం టార్గెట్ చేయలేదు

వంద శాతం టార్గెట్ చేయలేదు

మా అన్నదమ్ముల మీద కామెంట్ చేసినందుకు తిరిగి సరదాగా, నవ్వుతూ ఫన్నీగా చేశానే తప్ప సీరియస్ గా చేయలేదు. వాస్తవానికి ఆ వ్యక్తిని టార్గెట్ చేయలేదు. వంద శాతం చేయలేదు. ఎవరైనా అలా భావిస్తే ఫర్వాలేదు... అని నాగబాబు అన్నారు.

అందుకే బాధ అనిపించింది

‘‘కళ్యాణ్ బాబు, , చిరంజీవిగారు అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆయన అలా అన్నందుకు నేను ఫీలవ్వలేదు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీ తెలుగు దేశం పార్టీకి, మీ బావ(చంద్రబాబు నాయుడు) వచ్చి అడిగితే తను కంటెస్ట్ చేయకుండా జగన్ గెలవాల్సిన పరిస్థితిలో మీ గెలుపుకు కారణం అయ్యాడు. అలాంటి వ్యక్తి ఎవరో తెలియదు అంటే నన్ను బాధించిందని'' నాగబాబు అన్నారు.

మరి మీరెందుకు ఫీలవుతున్నారు?

మరి మీరెందుకు ఫీలవుతున్నారు?

‘‘మీ పార్టీకి పని చేసి, మీ పార్టీ గెలవడానికి కృషి చేసిన వ్యక్తినే మీరు తెలియదు అన్నపుడు... ‘‘మీరు తెలియదు అని నేనే అంటే ఎందుకు అంత ఫీలవుతున్నారు? మీరు అలా అంటే ఫర్వాలేదు కానీ... తిరిగి మేము అంటే కోపం ఎందుకు? ఇది కరెక్ట్ కాదు.'' అని నాగబాబు వ్యాఖ్యానించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X