ఆ ఇద్దరు మా ఫ్యామిలీతో కలవలేదు, మూడో ఆవిడ కళ్యాణ్ బాబుకు బెస్ట్ జోడీ: నాగబాబు

రాజకీయాల్లోకి వెళ్లిన సినీ నటుడు పవన్ క‌ళ్యాణ్‌ను రాజకీయ ప్రత్యర్థులు ఆయన్ను నేరుగా ఎదురుకోలేక వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావిస్తూ ఆరోపణలు చేయడం ఈ మధ్య తరచూ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో తన ఫేస్ బుక్ పేజీ ద్వారా లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మెగా బ్రదర్ నాగబాబు ఇందుకు సంబంధించిన అంశాలపై స్పందించారు.

అంతే కాదు...పవన్ కళ్యాణ్ ఈ మూడు వివాహాలు చేసుకోవడానికి గల కారణాలు కూడా వివరించారు. అయితే మొదటి ఇద్దరి కంటే పవన్‌ను పెళ్లాడిన మూడో అమ్మాయి ది బెస్ట్ అంటూ నాగబాబు ప్రశంసలు గుప్పించడం గమనార్హం.

మొదటి అమ్మాయితో సరిపడలేదు

మొదటి అమ్మాయితో సరిపడలేదు

నా తమ్ముడి పర్సనల్ లైఫ్ మీద నేను కామెంట్ చేయవచ్చో లేదో కానీ మొదట ఒక అమ్మాయిని పెళ్లి చేసకున్నాడు. ఆ అమ్మాయతో సరిపడలేదు. చాలా మర్యాదగా విడాకులు తీసుకున్నారు. రెండు కుటుంబాల తరుపు నుంచి మ్యూచువల్ అండర్‌స్టాండింగ్‌లో కోర్టు నిబంధనలకు లోబడి.. చట్ట పరంగా ఏమేం చేయాలో అన్నీ చేసి విడాకులు ఇచ్చేశాడు... అని నాగబాబు తెలిపారు.

ఆ తర్వాత రేణు దేశాయ్‌తో

ఆ తర్వాత రేణు దేశాయ్‌తో

ఆ సమయంలోనే రేణు దేశాయ్‌తో ఒక అండర్ స్టాండింగ్ ఏర్పడింది. కొంత కాలం పాటు కలిసున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి మనస్పర్దలు వచ్చాయో మరోసారి మ్యూచువల్ అండర్ స్టాండింగులో విడిపోయారు. తను ఫస్ట్ అడిగిందా? లేక మరేదో తెలియదు కానీ ఇద్దరూ ఇష్టప్రకారం విడిపోయారు.

 ఆ ఇద్దరూ మా కుటుంబంతో కలిసేవారు కాదు

ఆ ఇద్దరూ మా కుటుంబంతో కలిసేవారు కాదు

ఇపుడున్న అమ్మాయి భారతీయురాలు కాదు. రష్యన్ అమ్మాయి. ముందు ఉన్న ఇద్దరినీ నేను విమర్శించే పని చేయను. ఎందుకంటే వారు ఆడపిల్లలు. వాళ్లు మా కుటుంబంతో అంతగా కలిసేవారు కాదు. కొంచెం డిఫరెంటుగా ఉండేవారు.

 మూడో అమ్మాయి రష్యాన్, కానీ పవన్‌కు తగిన జోడీ

మూడో అమ్మాయి రష్యాన్, కానీ పవన్‌కు తగిన జోడీ

ఇపుడున్న అమ్మాయి రష్యన్ అయినా పూర్తిగా ఇండియన్ సాంప్రదాయాలను గౌరవిస్తుంది. చాలా స్వీట్ గర్ల్. కళ్యాణ్ బాబుకు ఇప్పటికి ఒక మంచి అమ్మాయి దొరికిందని నా పర్సనల్ ఫీలింగ్. తనకు నచ్చిన అమ్మాయి, తనకు అనుకూలంగా ఉండే అమ్మాయి.... అంటూ నాగబాబు ప్రశంసలు గుప్పించారు.

మా కుటుంబంలో అందరికీ ఆమె అంటే ఇష్టం

మా కుటుంబంలో అందరికీ ఆమె అంటే ఇష్టం

కొన్ని ఫార్మాలిటీస్ మేము కూడా మరిచిపోతున్నాం. కానీ ఆ అమ్మాయి అన్నీ చేస్తుంది. ఆమెను చూస్తే ముచ్చటేస్తుంది. చిరంజీవి అన్నయ్య దగ్గర నుంచి మా ఫ్యామిలీ మొత్తం ఆమె అంటే ఇష్టపడతారు. ఇంత మంది ఇష్టాన్ని ఆ అమ్మాయి సంపాదించుకున్నారని నాగబాబు తెలిపారు.

కళ్యాణ్ బాబు మ్యారేజెస్ గురించి మాట్లాడటం మంచిది కాదు

కళ్యాణ్ బాబు మ్యారేజెస్ గురించి మాట్లాడటం మంచిది కాదు

కళ్యాణ్ బాబు లంచం తిన్నాడు, స్కాములు చేశాడు, రాజకీయంగా భయంకరమైన తప్పులు చేశాడు, ఆయన వల్ల ఇన్ని నష్టాలు జరిగాయి, ఆయన వల్ల రాష్ట్రం దివాలా తీసింది... అలాంటివి ఏమైనా ఉంటే దాన్ని విమర్శించడంలో తప్పులేదు. ఎందుకంటే రాజకీయంలో యుద్ధంలో ఇదంతా సహజం. ఇక్కడ కళ్యాణ్ బాబు మ్యారేజెస్ మీద మాట్లాడుతున్నారు. జగన్ లాంటి వ్యక్తులు నాలుగు పెళ్లిళ్లు అని విమర్శిస్తున్నారు. ఇది సరైంది కాదు అని నాగబాబు అన్నారు.

ఇలా చేయడం చాలా నీచం

ఇలా చేయడం చాలా నీచం

ఒక వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత జీవితం మీద టార్కెట్ చేయడం నీచం. టీడీపీ గవర్నమెంటు కూడా చాలా మందితో ఇలాంటి ఆరోపణలు చేయించారు. వారికి చెప్పేది ఒకటే. ఈ ఆరోపణలతో మీరు ఏమీ చేయలేరు. ఇవి కోర్టు ద్వారా పరిష్కారమైన కేసులు. మీకు అంతగా ఇంట్రస్టు ఉంటే కెలుక్కోండి. కానీ మీరు మాట్లాడితే పెళ్లిళ్లు అని ప్రస్తావించడం ద్వారా మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టకుంటున్నారు. కళ్యాణ్ బాబు ప్రజా సమస్యలపై మాట్లాడుతున్నారు. మీరు కూడా వాటి మీద మాట్లాడండి. విమర్శించాలంటే కొత్తగా విమర్శించండి అని నాగబాబు అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X