మీకెంత అహంకారం.. సంకర జాతి అంటూ.. బాలయ్య 5వ కామెంట్‌పై నాగబాబు!

Recommended Video

Naga Babu Responds to Balakrishna Comments On Janasena Party | Filmibeat Telugu

మెగా బ్రదర్ నాగబాబు, బాలయ్య మధ్య వివాదం కొనసాగుతోంది. బాలయ్య గతంలో చేసిన ప్రతి వివాదాస్పద వ్యాఖ్యకు నాగబాబు ధీటుగా జవాబిస్తున్నారు. ఇక బాలయ్య చేసిన 5వ కామెంట్ పై నాగబాబు తాజాగా స్పందించారు. గతంలో బాలయ్య జనసేన పార్టీని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు నాగబాబు చాలా ఘాటుగా సమాధానం ఇచ్చారు. కులాల పేరుతో ప్రజలని ఎలా విమర్శిస్తారని నాగబాబు బాలయ్యని ప్రశ్నించారు. టిడిపి నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

పరోక్షంగా మాట్లాడారు

పరోక్షంగా మాట్లాడారు

మీరు జగన్ పార్టీని విమర్శించాల్సి వస్తే నేరుగా విమర్శలు చేస్తారు. కానీ ఓ పార్టీని ఉద్దేశించి ఆ మధ్యన మీరు పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని నాగబాబు అన్నారు. ఏ మధ్యన కొన్ని సంకర జాతి పార్టీలు పుట్టుకొచ్చాయి. అలగా బలగా జనాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాయి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కులాలని వెటకారం చేస్తూ సామెతలు కూడా చెప్పారు అని బాలయ్య చేసిన వ్యాఖ్యల్ని నాగబాబు గుర్తు చేశారు.

 గౌరవం లేదా

గౌరవం లేదా

దీనిని బట్టి మీకు ఇతర కులాలు, మతాల పట్ల గౌరవం లేదని అర్థం అవుతోంది. అంత వెటకారం ఏంటి మీకు అని నాగబాబు బాలయ్యని ప్రశ్నించారు. మీరు చేసిన కామెంట్స్ జనసేన పార్టీని ఉద్దేశించే అని అనుకుంటున్నాను. మా తమ్ముడు మిమ్మల్ని రాజకీయంగా విమర్శించాడు. మీరుకూడా ఎలాంటి రాజకీయ విమర్శలైనా చేయండి. కానీ జనసేన పార్టీలో ఉన్న వ్యక్తులని కులాలని ఉద్దేశించి కామెంట్స్ చేయడం ఏంటి అని నాగబాబు ఫైర్ అయ్యారు.

 ఎంత అహంకారం

ఎంత అహంకారం

జనసేన పార్టీలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. అన్ని పార్టీల్లో అన్ని కులాల ప్రజలు ఉంటారు. పార్టీ సిద్ధాంతాలతో విభేదించండి. కానీ మనుషులని సంకర జాతి అంటూ కామెంట్ చేస్తారా. మీరెంత అహంకారంతో మాట్లాడుతున్నారో మీకెవరూ చెప్పలేదా అని నాగబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలా మాట్లాడితే మా మనోభావాలు దెబ్బతినవా. ఇన్ని రోజులు రాజకీయం నాకెందుకు అని ఊరుకున్నా.

వివాదానికి ముగింపు

వివాదానికి ముగింపు

త్వరలోనే మీరు చేసిన ఆరవ కామెంట్ పై స్పందించి ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతా అని నాగబాబు అన్నారు. మీరేం మాట్లాడారో వివరంగా చెప్పి నా స్పందన కుడా తెలియజేస్తా . నాకు ఎవ్వరితో వివాదాలు పెట్టుకునే ఉద్దేశం లేదని నాగబాబు అన్నారు. బాలయ్య ఎవరో నాకు తెలియదు అన్న కామెంట్ తో నాగబాబు విమర్శలు ప్రారంభించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X