అలా చేస్తుండటంతో....పవన్ కళ్యాణ్‌కు నిక్‌నేమ్ పెట్టిన నాగబాబు!
Recommended Video

పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. ఆయనకు ఖాళీ సమయం దొరికితే హైదరాబాద్ శివారులోని ఫాంహౌస్‌కు వెళ్లిపోతారు. సాధారణంగా ఏ హీరో అయినా ఒక సినిమా పూర్తయిన వెంటనే తర్వాత సినిమా ఎలాంటిది చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలాంటి ఆలోచనల్లో మునిగి తేలడం కంటే తోటకు వెళ్లి వ్యవసాయం చేస్తూ గడపటాన్ని ఇష్టపడతారు.

తోటరాముడు
పవన్ కళ్యాణ్ వ్యవహారంపై నాగబాబు ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ...ఏ హీరో అయినా తాను చేసే సినిమాలకు మధ్య గ్యాప్ లభించినప్పుడు తదుపరి చేయబోయే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ గురించి ఆలోచిస్తాడు, కానీ పవన్ కళ్యాణ్ కాస్త డిఫరెంట్, తోటపని, వ్యవసాయం చేయడాన్ని ఇష్టపడతాను. అందుకే ‘తోటరాముడు' అని ముద్దు పేరుపెట్టాను' అని తెలిపారు.

పవన్ కళ్యాణ్ వ్యవసాయ క్షేత్రం
పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివారులో ఎనిమిది ఎకరాల సొంత వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో రకాల ఆకు కూరలు, పండ్లు, పూల మొక్కల సాగు జరుగుతోంది. రసాయనాల అవసరం లేని గోఆధారిత సాగు ఇందులో జరుగుతోంది.

చిన్న తనంలో నాయనమ్మ వండిన రుచి
రసాయలు లేకుండా పంట పండిస్తే ఆ రుచే వేరని, చిన్న తనంలో నాయనమ్మ వండిపెట్టినపుడు కూరలు ఎంత రుచిగా ఉన్నాయో అంతే రుచిగా తన ఫార్మ్ హౌస్ కూరగాయల రుచి ఉంటుందని గతంలో పవన్ కళ్యాణ్ ఓ సందర్భంలో వెల్లడించారు.

ప్రకృతి ఉద్యమం
ప్రస్తుత కాలంలో రసాయనాలతో కూడిన వ్యవసాయమే ఎక్కువగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకృతి ఉద్యమాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో విజయరామ్ అనే వ్యక్తితో కలిసి తన వంతు ప్రయత్నం చేశారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ తన తోటలో తోట పని చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











