బయోపిక్ అంటే మీదేనా.. బాలయ్య నోరు జారారు.. నాగబాబు వివరణ!
Recommended Video

మెగా బ్రదర్ నాగబాబు, నందమూరి బాలకృష్ణ వివాదం తారాస్థాయికి చేరుతోంది. బాలయ్య గతంలో పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఉద్దేశించిన చేసిన ప్రతి వివాదాస్పద వ్యాఖ్యకు నాగబాబు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం అటు మీడియాలోనూ, ఇటు అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నాగబాబు తాను చేసిన ప్రతి వ్యాఖ్యకు, పేస్ బుక్ లో చేసిన ప్రతి పోస్ట్ కు సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తాను బాలకృష్ణని డైరెక్ట్ గా ఒక్క మాట కూడా అనలేదని అన్నారు. తనకు నచ్చిన కొన్ని అంశాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశానని నాగబాబు అన్నారు.

మీరు ఎన్నైనా మాట్లాడొచ్చా
మీరు ఎన్ని మాటలన్నా మా గురించి మాట్లాడవచ్చు. కానీ మేము పరోక్షంగా ఒక మాట అంటే ఇంతలా విలవిలలాడుతున్నారు ఎందుకు అని నాగబాబు ప్రశ్నించారు. మా తమ్ముడిని అన్ని మాటలు అంటే కోపం రాదా. మిమ్మల్ని నేరుగా ఒక్క మాట కూడా అనలేదు.. కనీసం మీ పేరు కూడా ప్రస్తావించలేదు అని నాగబాబు తాజాగా తన వీడియో ద్వారా తెలిపారు. బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నా..అందులో తప్పేం ఉంది అని ప్రశ్నించారు.

ఫేస్ బుక్‌లో కామెంట్స్
తాను ఇటీవల ఫేస్ బుక్ కొన్ని కామెంట్స్, పోస్ట్ లు పెట్టానని నాగబాబు అన్నారు. మీరు ఎలాంటి తప్పు చేయకుంటే ఆ కామెంట్స్ కు ఎందుకు భాదపడుతున్నారు. సారే జహాసే అచ్చ గీతాన్ని చిన్నపిల్లవాడు చాలా బాగా పాడాడు. అది నాకు నచ్చింది. అందుకే ఆ వీడియోని పోస్ట్ చేశా. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు అంటూ నాగబాబు ప్రశ్నించారు.

మేము ఆ జాతి వాళ్ళమే
మీరు రాజవంశీకులు అయి ఉండవచ్చు.. కానీ తాము మాత్రం వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చామని నాగబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. మీరు అన్నట్లు మేము సంకర జాతి వాళ్ళమే. అందువల్లనే మాకు జంతువులపై ప్రేమ. పెంపుడు శునకాలని ప్రత్యేకమా ఇష్టపడతా. నేను పోస్ట్ చేసిన పెంపుడు కుక్కలు, దున్నపోతు ప్రత్యేకమైన జాతికి చెందినవి. జంతువుల గురించి మాట్లాడేటప్పుడు బ్రీడ్ గురించి మాట్లాడతాం. ఆ జంతువులు ఏ బ్రీడ్ కు చెందినవో తెలియాలని తాను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసానని నాగబాబు అన్నారు.

బయోపిక్ అంటే మీదేనా
బయోపిక్ చిత్రాల గురించి కూడా ఓ పోస్ట్ పెట్టా. నాకు కూడా అప్పుడప్పుడూ పద్యాలు, కవితలు రాయాలని అనిపిస్తుంది. అందుకే బయోపిక్ చిత్రాల గురించి కవిత రాశా. అది మీ బయోపిక్ గురించే అని మీరెందుకు అనుకుంటున్నారు.గతంలో బయోపిక్ చిత్రాలు చాలానే వచ్చాయని నాగబాబు తెలిపారు.
ఆరవ కామెంట్‌తో ముగింపు
మా అన్నయ్య ధర్మరాజు లాంటివారు. మేము ఎంత ఆవేశంతో ఉన్నా వివాదాలు వద్దని అంటారు. నాకు కూడా వివాదాలు ఇష్టం లేదు. చిరంజీవిగారిని ఉద్దేశిస్తూ బాలయ్య చేసిన ఆరవ కామెంట్ కు కౌంటర్ ఇచ్చి, ఈ వివాదాన్ని ముగిస్తానని నాగబాబు తెలిపారు. త్వరలోనే ఆ కామెంట్ పై స్పందిస్తానని అన్నారు.


Click it and Unblock the Notifications











