వరుణ్ తేజ్‌కు పవన్ గురించే బాధ.. బాబాయ్ ఒక్కడే కష్టపడుతుంటే, మనం ఇలా ఏంటి నాన్న!

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నడిపిస్తూ 2019 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కు తన కుటుంబం నుంచి నెమ్మదిగా మద్దత్తు పెరుగుతోంది. మెగా కుటుంబ సభ్యులంతా పవన్ కు నైతికంగా మద్దత్తు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ సోదరుడు నాగబాబు, ఆయన తనయుడు వరుణ్ జనసేన పార్టీకి భారీ విరాళాన్ని అందించడం ఆసక్తిగా మారింది. సోషల్ మీడియా వేదికగా పవన్ సోదరుడు నాగబాబుకు, వరుణ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక మెగా అభిమానులు పేద ఎత్తున వరుణ్ ని అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మా తమ్ముడికి కృతజ్ఞతలు

మా తమ్ముడికి కృతజ్ఞతలు

దీనిపై మెగా బ్రదర్ నాగబాబు తన సోషల్ మీడియా లైవ్ వీడియోలో మాట్లాడారు. ఇటీవల జనసేన పార్టీకి ఎన్నికల సంఘం కేటాయించిన గాజు గ్లాసు గుర్తుని చూపిస్తూ ఈ గ్లాసులో టీ కానీ, కాఫీ కానీ తాగితే ఆ టేస్టే వేరు అని అన్నారు. మా తమ్ముడికి కృతజ్ఞతలు. నా గురించి, వరుణ్ తేజ్ గురించి ట్వీట్ చేశాడు. వాస్తవానికి మేము అందించింది చాలా చిన్న సాయం. జనసేన పార్టీ చాలా పెద్ద ఆశయం కోసం స్థాపించింది అని అన్నారు.

వరుణ్ తేజ్‌కు పవన్ గురించే బాధ

వరుణ్ తేజ్‌కు పవన్ గురించే బాధ

ఒక పెద్ద మార్పు కోసం పవన్ కష్టపడుతున్నాడు. తనతో పాటు నేను కూడా దిగి ఏదైనా చేద్దాం అంటే కుదరడం లేదు. వరుణ్ తేజ్ కూడా పవన్ గురించే భాధపడుతుంటారు. బాబాయ్ ఒక్కడే కష్టపడుతున్నాడు నాన్న. నువ్వు ఏమీ చేయలేకపోతున్నావు. నేను షూటింగ్స్ లో బిజీగా ఉన్నాను. ఏదైనా చేద్దాం అని ఈ చిన్న సాయం అందించినట్లు నాగబాబు తెలిపారు.

భవిషత్తులో కూడా

భవిషత్తులో కూడా

పవన్ కు తమ సాయం ఇంతటితో ఆగదని నాగబాబు అన్నారు. భవిష్యత్తులో కూడా ఎంతోకొంత చేయడానికే ప్రయత్నిస్తాం అని తెలిపాడు. గత ఏడాది నుంచి పవన్ కు ఏవిధంగా సాయపడాలి అని ఆలోచిస్తున్నా. ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉంది అని నాగబాబు తెలిపారు. పవన్ కు కుటుంబ సభ్యులందరి నుంచి మద్దత్తు దక్కుతుండడం శుభపరిణామం అని మెగా అభిమానులు అంటున్నారు. యూరప్ పర్యటనలో ఉన్న పవన్.. తాను తిరిగి రాగానే నాగబాబుని, వరుణ్ ని కలుస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 ఆ వివాదంపై

ఆ వివాదంపై

ఇదిలా ఉండగా బాలయ్య ఎవరో తెలియదు అంటూ నాగబాబు ఆ మధ్యన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. దీని గురించి అంతరిక్షం ప్రచార కార్యక్రమాల్లో భాగంగా వరుణ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. బాలయ్య కూడా గతంలో పవన్ గురించి ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, తన తమ్ముడిని అంటే నాకు కోపం వచ్చింది.. అందుకే అలా మాట్లాడా అని నాన్న చెప్పినట్లు వరుణ్ తేజ్ తెలిపాడు. ఈ సంఘటనలో నాన్న నిర్ణయం సరైనదే అని వరుణ్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X