Lavanya Tripathi: మెగా కోడలి సిరీస్‌కు నాగబాబు రివ్యూ... లావణ్య ఏంటి అలా రియాక్ట్ అయింది?
దిల్లీ భామ లావణ్య త్రిపాఠి.. వరుణ్ తేజ్ ను పెళ్లాడి మెగా కోడలు అయిపోయింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇస్తుందని అంతా అనుకున్నారు. కానీ మిస్ ఫర్ ఫెక్ట్ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చి షాకిచ్చింది. పెళ్లి తర్వాత చేసిన మొదటి వెబ్ సిరీస్ ఇదే. ఇక ఈ సిరీసును తమ మామ నాగబాబు చూసి రివ్యూ ఇచ్చాడు. మామ రివ్యూపై లావణ్య త్రిపాఠి సైతం రియాక్ట్ అయింది. దీంతో వీరి ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అసలు విషయం ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం.
లావణ్య త్రిపాఠి.. దిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిపోయింది. ఇక ఈ భామ వరుణ్ తేజ్ తో ఆరు ఏళ్లుగా సైలెంట్ గా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాడు. పెద్దల సమక్షంలో వీరి వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీతో పాటు త్రిపాఠి ఫ్యామిలీ, పలువురు సినీ ప్రముఖులు వచ్చారు. ఇక పెళ్లి తర్వాత మెగా కోడలిగా బాధ్యతలు నిర్వహిస్తూ బిజీగా మారిపోయింది.

పెళ్లి తర్వాత సినిమాలు చేయదు అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇటీవల ఓ వెబ్ సిరీసుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ విజేత అభిజిత్ మరో కీలక పాత్రలో నటించగా... విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ సూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీసును రూపొందింది. ఇక ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
ఇక ఈ సిరీసుకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మిస్ పర్ ఫెక్ట్ సిరీసును మెగా బ్రదర్ నాగబాబు చూసారు. అనంతరం సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 'ఇటీవల మై బిలవుడ్ (నా ప్రియమైన) లావణ్య త్రిపాఠి నటించిన 'మిస్ పర్‌ఫెక్ట్' వెబ్ సిరీస్ చూశాను అంటూ రాసుకువచ్చారు. సిరీస్ చాలా బాగుంది.. ఎంతో గ్రిప్పింగ్ గా, ఫన్నీగా తెరకెక్కించారు. అందరూ తప్పక చూడండని రాసుకువచ్చారు.
తన వెబ్ సిరీస్ పై నాగబాబు రివ్యూ ఇవ్వగా మెగా కోడలు లావణ్య కూడా స్పందించింది. స్మైలీ ఎమోజీలను షేర్ చేసింది. దీంతో ఇద్దరి సంభాషణ నెట్టింట వైరల్ గా మారింది. ఇక మామ నాగబాబు రివ్యూపై లావణ్య స్పందించడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సిరీస్ విషయానికి వస్తే... ఇందులో ఓసీడీ ఉన్న ఓ అమ్మాయిగా లావణ్య త్రిపాఠీ నటించింది. కరోనా సమయంలో తన అపార్ట్‌మెంట్‌లో ఉన్న చెఫ్‌తో ప్రేమలో పడగా.. తానెవరో చెప్పకుండా పనిమనిషిగా అతనికి దగ్గరవుతుంది.
ఇక వీరి ప్రేమను బయపెట్టేందుకు పనిమనిషి, అతని తమ్ముడు ప్రయత్నాలు మొదలు పెడతారు. విషయం తెలుసుకున్న హీరో ప్రేమించిన అమ్మాయి అబద్ధం చెప్పిందని హీరోయిన్ ను అవాయిడ్ చేస్తాడు. చివరకు ఈ జంట ఎలా ఒక్కటయ్యారన్నది తెలుసుకోవాలంటే మిస్ పరఫెక్ట్ సిరీస్ చూడాల్సిందే. మంచి ఫ్యామిలీ వెబ్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్.


Click it and Unblock the Notifications











