నాగబాబు తీరు... పవన్ కళ్యాణ్‌కు లాభమా? నష్టమా?

పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీకి మద్దతుగా ఆయన సోదరుడు, నటుడు నాగబాబు యూట్యూబ్ వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్ష పార్టీల తీరును ఎండగడుతూ ఆయన తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.

నాగబాబు చేస్తున్న ఈ హడావుడిపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన తీరు పవన్ కళ్యాణ్‌కు, జనసేన పార్టీకి లాభం కలిగిస్తుందా? నష్టం కలిగిస్తుందా? అనే చర్చ మొదలైంది. ఈ అంశంపై తెలకపాటి లాంటి విశ్లేషకులు మాట్లాడుతూ... ఆయన చేస్తున్న ప్రయోగం మంచిదే కానీ, అవి వివాదాస్పదం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.

ఇద్దరు బ్రదర్స్‌ను మిక్స్ చేస్తే నాగబాబు

ఇద్దరు బ్రదర్స్‌ను మిక్స్ చేస్తే నాగబాబు

చిరంజీవి చాలా హంబుల్‌గా, తక్కువగా మాట్లాడటం మనం చూస్తుంటాం. పవన్ కళ్యాణ్ రియలిస్టిక్‌గా ఉంటూనే ఎమోషనల్‌గా, ట్రాన్ఫరెంటుగా మాట్లాడతారు. ఈ ఇద్దరినీ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో నాగబాబు తీరు అలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

వ్యతిరేక శక్తులు తయారయ్యే అవకాశం ఉంది

వ్యతిరేక శక్తులు తయారయ్యే అవకాశం ఉంది

నాగబాబు ఏం మాట్లాడినా అది తప్పకుండా జనసేన పార్టీపై ప్రభావం చూపుతుంది. ఏదైనా పొరపాటు జరిగితే వ్యతిరేక శక్తులు తయారయ్యే అవకాశం ఉంది. రేపు ఏదైనా ఇష్యూ వచ్చినపుడు పవన్ కళ్యాణ్ నేరుగా అనకుండా తన సోదరుడితో అనిపించారనే ఒక మెసేజ్ కూడా ప్రజల్లోకి వెళుతుందని అంటున్నారు.

నాగబాబు చేస్తున్న స్కిట్స్ వల్ల ప్రయోజనమే

నాగబాబు చేస్తున్న స్కిట్స్ వల్ల ప్రయోజనమే

నాగబాబు ఇటీవల తన వీడియోల్లో అధికార, ప్రతి పక్ష పార్టీల తీరు ఎండగడుతూ జబర్దస్త్ తరహాలో స్కిట్స్ చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని, ఎన్నికల సమయంలో ఇలాంటివి జనసేన పార్టీకి మరింత ప్లస్సయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

నాగబాబు చెప్పిన మంచి మాట

నాగబాబు చెప్పిన మంచి మాట

తాజాగా నాగబాబు తన సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఒక మంచి మాట మిత్రమా.. పొగిడే వాళ్ళు నీ చుట్టూ ఉంటె నువ్వు గెలిచినట్టు కాదు...తిట్టే వాడు నీ పక్కన ఉంటె నువ్వు ఓడినట్టు కాదు.'' అని చెప్పడం ద్వారా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X