ఒక్క క్షణంలో నా జీవితం తలక్రిందులైంది, ఇప్పుడు చెప్పుకోలేను: నాగబాబు
అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ఒక్క క్షణం. వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపొందుతోంది. చక్రి చిగురుపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 28న విడుదలవుతుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

అవన్నీ ఇపుడు చెప్పుకోలేను
మీ జీవితంలో ‘ఒక్క క్షణం'లో మారిపోయిన సందర్భాలేమైనా ఉన్నాయా? అనే ప్రశ్నకు నాగబాబు స్పందిస్తూ..... ‘‘నా జీవితంలో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒక స్ల్పిట్ సెకండ్ లో తలక్రిందులైన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఈ వేడుకలో చెప్పుకోలేను. అలాంటివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి.'' అన్నారు.
Recommended Video


అది నాకు బాగా నచ్చింది
డైరెక్టర్ విఐ ఆనంద్ నాకు చాలా కాలం నుండి పరిచయం ఉంది. ఆనంద్ తొలి సినిమాకే ఒక పిల్లర్ లాంటి కథ చేశాడు. ‘ఒక్క క్షణం' ట్రైలర్ చూసినపుడే చాలా నచ్చింది శిరీష్ ఇంతకు ముందు చేసిన సినిమాలకంటే భిన్నమైన కథ అని నాగబాబు తెలిపారు.

నాలో ఆసక్తిని పెంచింది
‘ఒక్క క్షణం' ట్రైలర్లో నాకు నచ్చంది ఏమిటంటే... అగ్గిపుల్లలు వేసి....ఈ గుప్పెడు అగ్గి పుల్లల్లో రెండు పుల్లలు ప్యార్లల్ గా ట్రావెల్ చేస్తుంటే ఇంత మంది జనాభాలో ఎంత మంది జీవితాలు ప్యార్లల్ గా ట్రావెల్ చేస్తున్నాయి అనే థీయరీ తీసుకుని పాజిబులిటీ ఉండే విధంగా చెప్పాడు. దర్శకుడు చేసిన అలాంటి ఆలోచనే నన్ను సినిమాపై నాలో మరింత ఆసక్తి పెరిగేలా చేసింది.... అని నాగబాబు తెలిపారు.

తెలుగులో ఇలాంటి సినిమాలు రావడం లేదు
చాలా తెలుగు సనిమాలు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌లా ఉంటున్నాయి. కానీ ఒక థ్రిల్లర్‌లా, సైంటిఫిక్ బ్యాగ్రౌండ్, సైన్స్ ఫాంటసీతో రావడం లేదు. ఫాంటసీ అంటే యముడు, దెయ్యాలు, భూతాలు ఇవే తప్ప ఒక సైన్స్ ఫాంటసీ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈ సినిమాలో అలాంటిది ఉండటం చాలా నచ్చింది. ఇలాంటి సినిమా మా శిరీష్ చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా పెద్ద హిట్టవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... అని నాగబాబు తెలిపారు.


Click it and Unblock the Notifications











