ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా చేశాడు.. రెండు వేల కోట్లు సంపాదించేవాడిని.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్
మెగా బ్రదర్ నాగబాబు చెప్పే నగ్న సత్యాలు, అక్షర సత్యాలు వింటే ఎవ్వరైనా సర్ ఫిదా కావాల్సింది. అయితే ఒక్కోసారి ఆయన చేసే కామెంట్స్ పట్ల కొందరి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆ మధ్య గాంధీ, గాడ్సే, దేవుళ్లు, కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మల అంశాలపై స్పందించినప్పుడు ఎంతటి వివాదంరేగిందో అందరికీ తెలిసిందే. నాగబాబు చేసిన కామెంట్స్‌ను జనసేనకు ఆపాదించి, పార్టీ పరువుపోయే వరకు వచ్చింది వ్యవహారాం. ఆ వ్యాఖ్యలన్నీ తన వ్యక్తిగతమని మళ్లీ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

యూట్యూబ్‌లో హల్చల్..
నాగబాబు యూట్యూబ్‌లో తన పేరు మీదుగా ఓ యూట్యూబ్ చానెల్ క్రియేట్ చేసుకున్నాడు. తన ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునేందుకు అది సరైన వేదికగా భావించినట్టున్నాడు. అందుకే ఈ ఫ్లాట్‌ఫాంలో మాట్లాడుతున్నానని నాగబాబు చెప్పుకొచ్చాడు. తనకు నచ్చిన అంశంపై తన భావాలను చెబుతో ఎందరి అభిమానాన్నో సంపాదించుకుంటున్నాడు.

జనాలకు ఉపయోగపడేవి..
సాధారణ ప్రజలకు ఉఫయోగ పడేవి, వారిలోని ప్రతిభన వెలికితీసేందుకు కొత్త కొత్త ప్రోగ్రాంలను నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ మధ్య మెడీ క్లెయిమ్ ఆవశ్యకతను చెప్పి ఎందరికో కనువిప్పు కలిగించాడు. తన సొంత అనుభవాలను చెబుతూ మెడికల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని జాగ్రత్తలు చెప్పాడు. ఇక ఖుషీ ఖుషీగా, విజిల్ అంటూ కొత్త ప్రోగ్రాం ఏర్పాట్లు కూడా మొదలుపెట్టాడు.

డబ్బు ఆవశ్యకత..
మనిషికి బంధాలు, అనుబంధాలు ముఖ్యమా? ప్రేమానురాగాలు ముఖ్యమా?.. డబ్బుతో అన్నీ కొనలేం.. డబ్బుతో కొనలేనివి కూడా ఉంటాయ్ అనే ఇలాంటి సోది మాటలు చాలానే వింటుంటాం..ఇవి భయంకరమైన సోది మాటలు.. అన్ని పనుల కన్నా డబ్బు సంపాదించడమే గ్రేటెస్ట్ పని..అంటూ డబ్బు ఆవశ్యకతను నాగబాబు వివరించాడు.
Recommended Video

అప్పుల మీద అప్పులు
పేరు చెప్పను గానీ ఓ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. అతన్ని కోరుకుని హీరో లేడు..అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ యాక్టర్.. అప్పుల మీద అప్పులు చేస్తుంటాడు.. నిజంగా అతని పొజిషన్‌లో నేను ఉంటే ఈ పాటికి ఓ రెండు వేల కోట్లు సంపాదించేవాడిని అంటూ నాగబాబు చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ సదరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరై ఉంటారా? అని అందరూ మెదడుకు పని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











