హిందువుగా పుట్టడం కన్నా.. గాడిదగా పుట్టడం బెటర్.. ఆ హత్యపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

మెగా ఫ్యామిలీ నుంచి కాంట్రవర్సీలపై ఎక్కువగా స్పందిస్తున్నారు నాగబాబు. ఆయన చేస్తున్న కామెంట్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అధికార పక్ష నేతలపైనే కాకుండా వివిధ రకాల ఘటనలపై కూడా నాగబాబు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఒక హిందు పండిట్ హత్యపై కూడా మెగా యాక్టర్ తీవ్ర స్థాయిలో స్పందించారు.

నాగబాబు ట్వీట్ వైరల్..

ఒక హిందు పండిట్ హత్య గురించి వివరణ ఇస్తూ... నిన్నే తెలిసింది కాశ్మీర్ లో ఒక హిందు పండిట్ అజయ్ అనే సర్పంచి ని చంపేశారు అని. పరవాలేదు చచ్చింది హిందూ పండిట్ కదా.చస్తే మనం ఎవరం ఫీల్ అవ్వక్కరలేదు.ఎక్కడో కాశ్మీరీ పండిట్, మనచుట్టం కాదు మన స్టేట్ కాదు..ఎక్కడో లయాడ్ అనే నల్లజాతి వ్యక్తి ని చంపితే ఇండియా లో కూడా స్పందించారు...కానీ ఇది ఇండియా కాబట్టి సో కాల్డ్ మీడియాతో పాటు సెక్యులరిస్టులు కూడా స్పందించనవసరం లేదు కదా అంటూ నాగబాబు కామెంట్ చేశారు.

గాడిదగా పుట్టడం బెటర్..

జరిగిన ఘటనపై కనీసం హిందువులకి ,హిందు సంస్థలకయినా బాధ్యత ఉండాలి కదా అంటూ.. మన రక్తం గడ్డ కట్టుకొని పోయింది. ఈ దేశం లో హిందువు గా పుట్టటం కన్నా ఒక గాడిద గా పుట్టటం బెటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎవరో మహానుభావుడు అన్న మాట నిజమేమో అనిపిస్తుంది అంటూ.. ఇంకా బయటకు రాని హత్యలు ఎన్నో ఉన్నాయని కామెంట్ చేశారు.

 హత్యలు ఎన్నో..

హత్యలు ఎన్నో..

మొన్న కొందరు సాధువులని చంపేశారని ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలని కవర్ చెయ్యని హిందువుల హత్యలు ఎన్నో.. అంటూ.. అజయ్ హత్యకి కారకులైన వారిని వెంటనే పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందు మతం, హిందువుల నమ్మకాలు ,హిందువుల సంస్కృతి,ఇలాగే నాశనము అయ్యేవరకు అందరం ఇలాగే ఉందాం అని మరో సెటైర్ కూడా వేశారు.

Recommended Video

Rana Daggubati-Miheeka Bajaj’s Wedding Not Postponed
ఆఖరి హిందువు చక్రవర్తి..

ఆఖరి హిందువు చక్రవర్తి..

నాకు తెలిసి హిందు దేశం లో ఆఖరి హిందువు చక్రవర్తి సామ్రాట్ పృథ్విరాజ్. ఇంకా అక్కడ్నుంచి మనం మహమ్మదీయ చక్రవర్తులు పాలనలో నలిగి పోయాం,బ్రిటిష్ పాలన లో నలిగిపోయాం, స్వతంత్రమ్ వచ్చినప్పటికీ కూడా బ్రిటిష్ ఏజెంట్ల పాలనలో నలిగిపోయాం. ఇప్పుడిప్పుడే అన్ని మతాలను సమానంగా చూసే ఒక పార్టీ పాలనలో ఉన్నాము అనిపిస్తోంది అంటూ.. వాళ్ళు కూడా మీనమేషాలు లేక్కిస్తున్నట్లుగా ఉందని అన్నారు. అదే విధంగా అన్ని మతాల వారు సమానంగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా ఉండాలని జరిగిన ఘటనపై మోడీ గారు స్పందిస్తే బావుంటుందని నాగబాబు పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X