కొడుక్కి ఫ్లాప్ ఇచ్చాడు.. అయినా సరే దర్శకుడిని మాత్రం ఆకాశానికెత్తేసిన నాగబాబు
తెలుగు దర్శకుల్లో ఒక్కొక్కరి శైలి ఒక్కోలా ఉంటుంది. శ్రీకాంత్ అడ్డాల సినిమాలంటే తెలుగు తెరపై అందరికీ ఓ అంచనాలుంటాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఎక్కడికో ఎదిగిపోయాడు శ్రీకాంత్ అడ్డాల. మొదటి ప్రయత్నంగా చేసిన కొత్త బంగారు లోకం తెలుగు సినీ ప్రముఖులను ఆశ్చర్యపరిచింది. అందుకే రెండో చిత్రంగా భారీ క్యాస్టింగ్, స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ తెరకెక్కించేందుకు ఛాన్స్ వచ్చింది. వచ్చిన ఆ అవకాశాన్ని బాగానే ఉపయోగించుకున్నాడు.

మెగా ప్రయోగం..
సీతమ్మ వాకిట్లో వంటి భారీ హిట్ కొట్టిన తరువాత శ్రీకాంత్ అడ్డాల క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకే మెగా కాంపౌండ్‌లో అడుగు పెట్టగలిగాడు. వరుణ్ తేజ్‌ను వెండితెరకు పరిచయం చేయగలిగాడు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరో ముకుంద లాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ అనుకోలేదు. అందుకే సినిమా కాస్త నిరాశ పరిచింది.

చాలా గ్యాప్..
ముకుంద ఫలితం నిరాశపర్చడంతో గ్యాప్ తీసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. మహేష్ బాబును ఒప్పించి బ్రహ్మోత్సవం అనే కళాఖండాన్ని తీశాడు. ఈ దెబ్బకు అడ్రస్ లేకుండా పోయినట్టైంది. 2016లో అది అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక అప్పటి నుంచి మరో ప్రాజెక్ట్ తెరకెక్కించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు నారప్ప రూపంలో ఛాన్స్ వచ్చింది.

మొదటిసారి రీమేక్..
తమిళంలో ధనుష్ హీరోగా వెట్రిమారన్ తెరకెక్కించిన అసురన్ చిత్రం కోలీవుడ్‌ను షేక్ చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని నారప్పగా తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఆ బాధ్యతలను శ్రీకాంత్ అడ్డాల తన భుజాన వేసుకున్నాడు. కోవిడ్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
Recommended Video

శ్రీకాంత్ అడ్డాల బర్త్ డే..
వరుణ్ తేజ్‌తో శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమా వర్కౌట్ కాకపోయినా.. దర్శకుడిపై నాగబాబు ప్రేమను కురిపించాడు. నేడు శ్రీకాంత్ అడ్డాల బర్త్ డే. ఈ సందర్భంగా నాగబాబు స్పందిస్తూ.. ఎంతో వినయవిధేయతలున్నా, ప్రియమైన శ్రీకాంత్ అడ్డాలకు హ్యాపీ బర్త్ డే. నీ గురించి తెలుసుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది.. నారప్ప హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సారి సక్సెసే నీ అభిమాని అవుతుంది అంటూ ధైర్యాన్ని నూరిపోశాడు.


Click it and Unblock the Notifications











