twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్షల కోట్లు సంపాదిస్తున్నారు.. అలా బుద్ది చెబుదాం.. మెగా బ్రదర్ సలహాలు

    |

    చైనాకు భారత దేశానికి నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. సరిహద్దుల వెంబడి చైనా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ప్రస్తుతం చైనా కవ్వింపు చర్యలు కూడా ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు దౌత్య సంబంధాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే చైనాకు బుద్ది చెప్పాలని, అందుకు చేయాల్సిన పనులను మెగా బ్రదర్ నాగబాబు చెప్పుకొచ్చాడు. సినీ రాజకీయ సామాజిక అంశాలపై స్పందించే నాగబాబు.. ఈ సారి చైనాపై ఫైర్ అయ్యాడు.

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    సోషల్ మీడియాలో యాక్టివ్..

    మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. సమకాలీన అంశాలపై పట్టు ఎక్కువ. సాంకేతికతను ఎలా వాడాలో కూడా బాగా తెలిసినవాడు. అటు యూట్యూబ్, ఇటు ట్విట్టర్ ఇలా అన్నింటిని వాడేస్తున్నాడు. నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలు వదిలి నానా రచ్చ చేస్తుంటాడు.

    వరుస ట్వీట్లు..

    వరుస ట్వీట్లు..

    గత కొన్ని రోజులుగా నాగబాబు వరుసగా ట్వీట్లు చేస్తూ వివాదాలకు దారి తీస్తున్నాడు. గాడ్సేను పొగడటం, కరెన్సీ నోట్లపై బొమ్మపై కామెంట్స్ చేయడం ఇలా ఆయన వేసే ట్వీట్లు ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయి. వ్యవహారం కేసులు పెట్టే వరకు కూడా వెళ్లింది. తాజాగా నాగబాబు చైనా ఆగడాలపై ఫైర్ అయ్యాడు.

     లక్షల కోట్లు..

    లక్షల కోట్లు..

    బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, యాప్స్ ( @banchinaproducts and @banchinaapps) అంటూ నాగబాబు భారతీయులకు సలహా ఇచ్చాడు. ‘మన దేశాన్ని ఆక్రమించుకోవలని చూస్తున్న చైనా వస్తువుల్ని,సెల్ ఫోన్ apps ని బహిష్కరిద్దాం.మన దేశం లో తయారైన వస్తువుల ని కొందాం.ప్రపంచం లో మన దేశం పెద్ద మార్కెట్.అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు..

    Recommended Video

    'Love Story' Movie Bags A Whopping Non-Theatrical Deal
     ఆ డబ్బుతో మన దేశమే..

    ఆ డబ్బుతో మన దేశమే..

    అదే మన ప్రొడక్ట్స్ ని మనమే కొంటె మన దేశమే లాభపడుతుంది.తిరిగి ఆ డబ్బుతో మన దేశం అభివృద్ధి చెందుతుంది.మనందరం బాగుపడతాం.మన డబ్బు మన దేశంలో నే వుంటుంది, మనమే బాగుపడదాం. అంతే కాని మన డబ్బుతో బాగుపడి మన దేశాన్ని అక్రమించుకోవలని చూసే చైనా వస్తువుల్ని ban చేద్దామ్.@beindianbuyindian' అంటూ ట్వీట్ చేశాడు.

    English summary
    Naga Babu Suggests That To Ban China Products. he says that to advice Indians on how to win a war against China. Ban China Products China Apps.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X