సీని పరిశ్రమ రక్తాన్ని పీల్చుతున్నారు, మెగా బ్రదర్ సెన్సేషనల్ కామెంట్స్,, విజయ్‌కి భారీ మద్దతు

టాలీవుడ్ సెన్సేషన్, రౌడీ స్టార్‌కు కోపం వచ్చింది. అది కూడా తీవ్రస్థాయిలో. తనపై తప్పుడు వార్తలు రాస్తూ, జనాలకు ఫేక్ న్యూస్ అందిస్తున్న వెబ్‌సైట్స్‌పై మండిపడ్డాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితిలో తాను చేస్తున్న సాయాన్ని కూడా వక్రీకరించడం, తప్పుగా ప్రొజెక్ట్ చేయడంపై వీడియో సందేశాన్ని వదిలాడు. సదరు వెబ్‌సైట్స్ ప్రచురించిన వార్తలను చదువుతూ అందులోని నిజానిజాలను బయట పెట్టాడు. ఈ మేరకు తప్పుడు వార్తలను, అలాంటి వాటిని రాసే వెబ్‌సైట్స్‌ను కట్టడి చేయాలంటూ పిలుపునిచ్చాడు. విజయ్ వేసిన ఈ ముందడుగులో టాలీవుడ్ మొత్తం నడుస్తోంది. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి.. విజయ్‌కు సపోర్ట్ చేస్తున్నారు.

Recommended Video

Star Heros Remunerations Must Cut Down Due to Coronavirus Impact
 హీరోయిన్ల మద్దతు..

హీరోయిన్ల మద్దతు..

ఫేక్ న్యూస్ రాసే వెబ్‌సైట్స్‌పై పోరాటం చేస్తున్న విజయ్‌కు మద్దతుగా రాశీ ఖన్నా, కాజల్ అగర్వాల్ వంటి వారు మద్దతుగా నిలిచారు. నాటి హీరోయిన్ రాధికా కూడా విజయ్‌కు మరింత బలం చేకూరాలంటూ ట్వీట్ చేసింది.

సినీ ప్రముఖుల సపోర్ట్..

సినీ ప్రముఖుల సపోర్ట్..

ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, కొరటాల శివ వంటివారు విజయ్ తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ.. ఇదే సరైన నిర్ణయం, సరైన సమయం అని పేర్కొంటూ నీ వెంట ఉంటామని విజయ్‌కు భరోసా ఇస్తున్నారు.

విజయ్ రెస్పాన్స్..

తనకు మద్దతు తెలుపుతున్న ప్రతీ ఒక్కరికి సమాధానం ఇస్తున్నాడు విజయ్. ఇదంతా మనందరి కోసం.. ఇకపై ఉపేక్షించేది లేదంటూ రిప్లై ఇస్తున్నాడు. విజయ్ మొదలు పెట్టిన ఈ పోరాటంలో ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ సపోర్ట్‌గా నిలిచాడు. ఇక పెద్ద హీరోలు కూడా స్పందించే అవకాశం ఉంది.

తాజాగా మెగా బ్రదర్..

తాజాగా మెగా బ్రదర్..

విజయ్‌కు మద్దతుగా మెగా బ్రదర్ నాగబాబు నిలిచాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ.. ‘హాయ్ విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌సైట్లపై పోరాటం చేయడం అనేది, వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్' అని పేర్కొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X