Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బిగ్ బాస్-3 మ్యాటర్లో వేలు పెట్టిన మెగాబ్రదర్ నాగబాబు
తెలుగులో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలో మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే స్టార్ మాటీవీ వారు 'బిగ్ బాస్ తెలుగు 3'కి సంబంధించిన అఫీషియల్ లోగో కూడా విడుదల చేశారు. అయితే ఈ సారి హోస్ట్ ఎవరు? అనే విషయం వెల్లడించకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు.
మొదటి సీజన్ బిగ్ బాస్ షోను యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలసిందే. తారక్ స్టార్ ఇమేజ్ ఈ షోను టాప్ రేటింగుల్లోకి తీసుకెళ్లింది. అయితే సినిమాల బిజీ వల్ల రెండో సీజన్లో కంటిన్యూ కాలేక తప్పకున్నాడు ఈ నందమూరి హీరో. రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు నాని కూడా తప్పుకోవడంతో మూడో సీజన్ కొత్త హీరోతో హోస్ట్ చేయించే ప్లాన్‌లో ఉన్నారు.
అయితే ఈ బిగ్ బాస్ మ్యాటర్‌లోకి మెగా బ్రదర్ ఎంటరవ్వడం చర్చనీయాంశం అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు యూట్యూబ్‌లో 'నా ఛానల్ నా ఇష్టం' అంటూ ఈ మధ్య కాలంలో పలు సంచలన వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు తన ఛానల్ ద్వారా 'బిగ్ బాస్ తెలుగు 3' షోకు సంబంధించి సర్వే నిర్వహించారు.
బిగ్‌బాస్-3 హోస్ట్‌గా వీరిలో ఎవరైతే భాగుంటుంది? అనే ప్రశ్న సంధిస్తూ వెంకటేష్, నాగార్జున, నాని, జూ ఎన్టీఆర్, స్టాయిర్ హీరోయన్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో ఎక్కువ మంది నాగార్జునకు (37 శాతం) ఓటు వేయడం గమనార్హం. 36 శాతం మంది వెంకటేష్ అయితే బావుంటుందని అభిప్రాయ పడ్డారు. ఎన్టీఆర్‌కు 16 శాతం, నానికి 3 శాతం, స్టార్ హీరోయిన్ అనే ఆప్షన్‌కు 8 శాతం ఓట్లు పడ్డాయి. బిగ్ బాస్ షోలో ఎలాంటి సంబంధం లేని నాగబాబు ఈ సర్వే నిర్వహించడం చర్చనీయాంశం అయింది.
సినీ నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయబోతోందని ఇటీవల వార్తలు ప్రచారంలోకి రాగా....ఆమె స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. తనకు ఈ షోలో పోటీ దారుగా పాల్గొనడం ఇష్టం లేదు కానీ హోస్ట్ చేసేయడాన్ని ఇష్టపడతాను అని ఆమె వెల్లడించారు.
కాగా... బిగ్ బాస్ షో జులై 3వ వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి నాగార్జున హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఆయనపై ప్రోమో చిత్రీకరణ జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడి కానుంది.