twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ బాస్-3 మ్యాటర్లో వేలు పెట్టిన మెగాబ్రదర్ నాగబాబు

    |

    తెలుగులో సూపర్ హిట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో త్వరలో మూడో సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే స్టార్ మాటీవీ వారు 'బిగ్ బాస్ తెలుగు 3'కి సంబంధించిన అఫీషియల్ లోగో కూడా విడుదల చేశారు. అయితే ఈ సారి హోస్ట్ ఎవరు? అనే విషయం వెల్లడించకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు.

    మొదటి సీజన్ బిగ్ బాస్ షోను యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన సంగతి తెలసిందే. తారక్ స్టార్ ఇమేజ్ ఈ షోను టాప్ రేటింగుల్లోకి తీసుకెళ్లింది. అయితే సినిమాల బిజీ వల్ల రెండో సీజన్లో కంటిన్యూ కాలేక తప్పకున్నాడు ఈ నందమూరి హీరో. రెండో సీజన్ నాని హోస్ట్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు నాని కూడా తప్పుకోవడంతో మూడో సీజన్ కొత్త హీరోతో హోస్ట్ చేయించే ప్లాన్లో ఉన్నారు.

    Naga Babu survey: Whom among these should host Bigg Boss 3?

    అయితే ఈ బిగ్ బాస్ మ్యాటర్లోకి మెగా బ్రదర్ ఎంటరవ్వడం చర్చనీయాంశం అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నాగబాబు యూట్యూబ్‌లో 'నా ఛానల్ నా ఇష్టం' అంటూ ఈ మధ్య కాలంలో పలు సంచలన వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు తన ఛానల్ ద్వారా 'బిగ్ బాస్ తెలుగు 3' షోకు సంబంధించి సర్వే నిర్వహించారు.

    Naga Babu survey: Whom among these should host Bigg Boss 3?

    బిగ్‌బాస్-3 హోస్ట్‌గా వీరిలో ఎవరైతే భాగుంటుంది? అనే ప్రశ్న సంధిస్తూ వెంకటేష్, నాగార్జున, నాని, జూ ఎన్టీఆర్, స్టాయిర్ హీరోయన్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఇందులో ఎక్కువ మంది నాగార్జునకు (37 శాతం) ఓటు వేయడం గమనార్హం. 36 శాతం మంది వెంకటేష్ అయితే బావుంటుందని అభిప్రాయ పడ్డారు. ఎన్టీఆర్‌కు 16 శాతం, నానికి 3 శాతం, స్టార్ హీరోయిన్ అనే ఆప్షన్‌కు 8 శాతం ఓట్లు పడ్డాయి. బిగ్ బాస్ షోలో ఎలాంటి సంబంధం లేని నాగబాబు ఈ సర్వే నిర్వహించడం చర్చనీయాంశం అయింది.

    సినీ నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయబోతోందని ఇటీవల వార్తలు ప్రచారంలోకి రాగా....ఆమె స్వయంగా ఖండించిన సంగతి తెలిసిందే. తనకు ఈ షోలో పోటీ దారుగా పాల్గొనడం ఇష్టం లేదు కానీ హోస్ట్ చేసేయడాన్ని ఇష్టపడతాను అని ఆమె వెల్లడించారు.

    కాగా... బిగ్ బాస్ షో జులై 3వ వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సారి నాగార్జున హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఆయనపై ప్రోమో చిత్రీకరణ జరుగుతున్నట్లు టాక్. త్వరలోనే ఈ విషయం అఫీషియల్‌గా వెల్లడి కానుంది.

    English summary
    Tollywood actor and Producer Naga Babu survey on Bigg Boss 3. He ask "Whom among these should host Bigg Boss 3?". 37% people vote for Nagarjuna. Bigg Boss Telugu is the Telugu-language version of the reality TV programme Big Brother and the fifth Indian version of reality TV programme Bigg Boss and airs on Star Maa in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X