నాగబాబు మరొకటి వదిలాడు: కామెడీ చేస్తూ సెటైర్లు వేసిన మెగా బ్రదర్!
'నా ఛానల్ నా ఇష్టం' అంటూ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా రోజుకో వీడియో రిలీజ్ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు సామాజిక, రాజకీయ అంశాలపై తనదైన అభిప్రాయాలు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఇదంతా చేసేది తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన 'జనసేన' పార్టీకి మద్దతు కూడగట్టడానికే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
నాగబాబు తాజాగా తెలుగు దేశం పార్టీ నేత లోకేష్ గురించి ఓ ఛానల్‌లో వచ్చిన వార్తపై సెటైర్లు వేశారు. సింబాలిక్‌గా తాళాలు వాయించి మరీ విమర్శలను సంధించే ప్రయత్నంచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కామెడీ చేస్తూనే కసితీరా సెటైర్లు
మొన్నటి వరకు నాగబాబు వీడియోలన్నీ చాలా సీరియస్‌గా ఉండేవి. తమ ప్రత్యర్థులను, తమను టార్గెట్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైర్ అవుతూ కనిపించేవారు. అయితే ఈ మధ్య ఆయన వీడియోల్లో కోపం కంటే ఫన్ ఎక్కువగా కనిపిస్తోంది. కామెడీ చేస్తూనే కసితీరా సెటైర్లు వేస్తున్నారు.

తమ్ముడి కోసమే...
నాగబాబు ఇదంతా చేసేది తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసమే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ప్రజల్లో ‘జనసేన' పార్టీకి మద్దతు కూడగడుతూ.... అధికార పార్టీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

నాగబాబు ప్రభావం ఉంటుందా?
నాగబాబు విడుదల చేస్తున్న వీడియోల ప్రభావం ప్రజలపై ఉంటుందా? అంటే... కొంతమేర ఉండొచ్చనే అంటున్నారు విశ్లేషకులు. మెగా ఫ్యామిలీ అభిమానుల ద్వారా ఇది మరింత విస్తరించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సామాజిక అంశాలపై కూడా...
కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాకుండా... సామాజిక అంశాలపై కూడా ఆయన స్పందిస్తున్నారు. మహిళలు, హీరోయిన్లు పొట్టిడ్రెస్సులు, తొడలు, బొడ్డు, క్లీవేజ్ కనిపించేలా డ్రెస్సులు వేయడాన్ని కొందరు విమర్శించడాన్ని నాగబాబు తప్పుబట్టారు. వస్త్రధారణ విషయంలో మహిళలను విమర్శించే హక్కు ఎవరికీ లేదంటూ తనదైన వాదన వినిపించారు.


Click it and Unblock the Notifications











