‘బెజవాడ రౌడీలు’ గురించి నాగచైతన్య
నాగచైతన్య తన తాజా చిత్రం'బెజవాడ రౌడీలు"గురించి మాట్లాడుతూ -''రామ్‌గోపాల్‌వర్మ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు ఎంతో ఎక్సైట్ అయ్యాను. ఇందులో నా క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది. దర్శకుడు వివేక్ అద్భుతంగా సినిమాను తీస్తున్నారు. నా కెరీర్‌కి ఈ సినిమా ఓ టర్నింగ్ పాయింట్ అవుతుంది"" అన్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ సోమవారం విజయవాడలో మొదలైంది. ఈ నెల 31 వరకు అక్కడే జరుగుతుంది.ప్రస్తుతం నాగచైతన్యపై వేలాదిమంది సమక్షంలో 'శరభ శరభ..." అనే పల్లవితో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను, ఛేజ్‌లను, ఫైట్స్‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.


Click it and Unblock the Notifications











