»   » ఇదీ దడ చిత్రం వెనక కథ

ఇదీ దడ చిత్రం వెనక కథ

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    నాగచైతన్య తన తాజా చిత్రం దడ నిన్న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం కథ మొదట ఇది కాదని వేరేదని నాగచైతన్య చెప్తున్నారు. ఈ విషయమై చైతూ మాట్లాడుతూ... మొదట దర్శకుడు అజయ్ భుయాన్ తనను కలిసి ఇంగ్లీష్ టీవీ షో ప్రిజన్ బ్రేక్ చిత్రం చేద్దామని ప్లాన్ చేసాడని చెప్పారు. అయితే అది కార్య రూపం దాల్చలేదని అప్పుడు ఈ దడ చిత్రం స్టోరీ లైన్ చెప్పి ఒప్పించాడని అన్నారు. ఇక ఈ చిత్రం ఓ స్టైలిష్ ఎంటర్టైనర్ గా మార్చాలని చెప్పి మరీ చేయించుకున్నానని చైతన్య అంటున్నారు. అలాగే తనకు హాలీవుడ్ తరహా యాక్షన్ సినిమా చేయాలనే కోరికే ఈ సినిమా చేయటానికి పురికొల్పిందని అన్నారు.

    ఇక ఈ చిత్రం చూసిన వారు చాలా ఇంగ్లీష్ సినిమాలు ఒకేసారి చూసిన ఫీల్ కు గురి అవుతున్నారు. వరల్డ్ సినిమా రెగ్యులర్ గా ఫాలో అయ్యేవారు ఈ చిత్రంలో షాట్స్ ని ఈజీగా గుర్తుపట్టేయగలుగుతారు. స్క్రీప్టే బలహానంగా తయారైన ఈ చిత్రం మార్నింగ్ షోకే అన్ని ఏరియాల నుంచి బ్యాడ్ రిపోర్టు తెచ్చుకుంది. మరో ప్రక్క కామిడీ పండకపోవటం, కాజల్ నటన తేలిపోవటం వంటివి జరిగాయి. ఈ చిత్రాన్ని మరో కేడీగా అభివర్ణిస్తున్నారు. ఈ వీకెండ్ వరకూ కలెక్షన్స్ ఉన్నా ఆతర్వాత కష్టమేనంటున్నారు. అందులోనూ ఈ రోజు రిలీజ్ అవుతున్న కందిరీగ చిత్రం ఓ మాదిరిగా ఉన్నా దడకు పెద్ద దెబ్బకొట్టినట్లే నని చెప్తున్నారు.

    English summary
    Chaitu revealed that when he met Ajay Bhuyan he wanted to remake the English TV show ‘Prison Break’ as a film but that didn’t work. Later, Ajay came up with ‘Dhada’ which is a stylish entertainer.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more