విడిగా ఎందుకు ఉంటున్నానంటే...: నాగైచైతన్య
ఈ విషయమై ఆయన మాట్లాడుతూ... కెరీర్ ఆరంభించి, సొంతంగా డబ్బులు సంపాదించడం మొదలుపెట్టిన తర్వాత ఇండిపెండెంట్‌గా ఉండాలనిపించింది. స్వేచ్ఛగా ఉండటమంటే నాకిష్టం. ఒంటరిగా ఉండటమనేది ఓ పాఠం... బాధ్యతలు తెలుస్తాయి అన్నారు.
ఇక అంతకుముందు నేనేం పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ ఒక్కణ్ణే ఉండటం మొదలుపెట్టిన తర్వాత పొద్దున్నే టిఫిన్‌కి అన్నీ ఉన్నాయా? లంచ్‌కి ఏం చేసుకోవాలి? అని ఆలోచించడం మొదలుపెట్టాను. ఓ ఇల్లు మెయిన్‌టైన్ చేయడం అనేది క్రమశిక్షణలాంటిదే. ఉదయాన్నే వంటవాడు వచ్చి.. 'పాలు లేవు.. గుడ్లు కూడా లేవు.. ఏం చెయ్యమంటారు?' అని అడుగుతాడని ముందే అవి ఉండేలా చూసుకుంటాను అని అన్నారు.
తన స్టెప్ మదర్ అమల గురించి చెప్తూ.. స్టెప్ మదర్స్ అనగానే ఏదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు అమల ఆంటీ మీద మంచి ఫీలింగ్ ఉంది. ఆవిడంటే నాకు చాలా గౌరవం. తను కూడా నాతో బాగుంటుంది. నాకేంటంటే.. నాన్నగారు చాలా హ్యాపీగా ఉన్నారు. అందుకని ఆవిడ మీద రాంగ్ ఒపీనియన్ లేదు అన్నారు.
ఇప్పుడు నేనేదో పెరిగాను కదా అని.. అప్పటి విషయాలను తవ్వి, నాన్నని అడగటం కరెక్ట్ కాదు. అందరూ హ్యాపీగా ఉన్నారు. అందుకని లేనిపోని విషయాల గురించి మాట్లాడటం అనవసరం. మా ఇంట్లోవాళ్లందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను కూడా వాళ్లతో కలిసి ఆ ఆనందాన్ని షేర్ చేసుకోవడమే కరెక్ట్ అని తేల్చి చెప్పారు.


Click it and Unblock the Notifications












