వాళ్ల ముందు భగభగ మండుతాను : నాగచైతన్య
హైదరాబాద్ : నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'. ఆ చిత్రంలో నాగచైతన్య టైటిల్ రోల్ లో సూర్య పాత్రలో కనపించనున్నారు. ఆ చిత్రంలో తన పాత్ర గురించి నాగ చైతన్య మాట్లాడుతూ... 'సూర్య... ఆటోనగర్‌లో అతని పేరు తెలియని వారుండరు. మంచివాళ్లకు ఉషోదయపు సూర్యుడే. తన ఉనికిని ఇష్టపడని వాళ్ల ముందు భగభగ మండుతాడు. ఈ లక్షణాలు చూసే ఓ అందాల భామ అతనికి మనసిచ్చింది. వారిద్దరి ప్రేమ కథకు ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే' అంన్నారు నాగచైతన్య. సమంత హీరోయిన్ గా చేస్తున్ ఈ చిత్రం రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.
నిర్మాత అచ్చి రెడ్డి మాట్లాడుతూ ''సామాజిక అంశాలు స్పృశిస్తూ సాగే చిత్రమిది. నాగచైతన్య పాత్ర చిత్రణ, ఆయన నటన అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. దేవా శైలి కథ, కథనాలు ప్రధాన బలం. వినోదం, మాస్ అంశాల మేళవింపుతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఆటోనగర్ అడ్డాగా చేసుకొన్న ఓ యువకుడు సాధించిందేమిటో తెరపైనే చూడాలి. నాగచైతన్యని ఒక కొత్త కోణంలో తెరపై ఆవిష్కరిస్తున్నాం. అనూప్ చక్కటి పాటలు సమకూర్చారు. అన్నివర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించే చిత్రమవుతుందని అన్నారు. సాయికుమార్ ఓ ముఖ్య భూమిక పోషిస్తున్నారు'' అన్నారు.
దర్సకుడు దేవకట్టా సినిమా గురించి మాట్లాడుతూ.....ఆ వూరికి వెళ్లి సూర్య పేరు చెబితే చాలు... ఆ ఆటోనగర్ సూర్యేనా? అంటూ మొదలుపెడతారు. ఆటోనగర్ ఎంత ఫేమసో... అక్కడుండే సూర్యకి కూడా అంతే పేరు మరి. నలుగురి కష్టసుఖాల గురించి ఆలోచించే ఆ యువకుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెరపైనే చూడాలన్నారు.ఈచిత్రాన్ని నవంబర్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వినోదం, యాక్షన్ అంశాలతో మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో నాగచైతన్యని ఓ కొత్త కోణంలో తెరపై చూపెట్టబోతున్నాడు దర్శకుడు దేవా కట్ట. ఆటోనగర్ నీడలో పెరిగిన ఓ నవతరం యువకుడి కథ ఇది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'ఆటోనగర్ సూర్య'లో నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్నారు. మ్యాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై కె.అచ్చిరెడ్డి నిర్మిస్తున్నారు. సమర్పణ: ఆర్.ఆర్.మూవీమేకర్స్.


Click it and Unblock the Notifications











