twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నని సాకుగా చూపించి నో చెప్పాలనుకున్నా, క్లాస్ నుంచి గెంటేశారు.. నాగచైతన్య!

    |

    Recommended Video

    నాన్నని సాకుగా చూపించి నో చెప్పాలనుకున్నా, క్లాస్ నుంచి గెంటేశారు.. నాగచైతన్య!

    లెజెండరీ నటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతోంది. చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సావిత్రి జీవితం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సినీ అభిమానులందరిలో ఉంటుంది. దానిని వెండి తెరపై చూపించాలంటే నటీనటుల ఎంపిక పక్కాగా ఉండాలి. దర్శకుడు నాగ అశ్విన్ ఆ విషయంలో మ్యాజిక్ చేశాడు.

    సావిత్రి పాత్ర కిశోరం యువ నటి కీర్తి సురేష్ ని ఎంపిక చేసుకున్నాడు. జెమినీగణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించిన సంగతి తెలిసిందే. ఇతరపాత్రలో సమంత, విజయ్ దేవరకొండ నటించారు. ఏఎన్నార్ గా ఈ చిత్రంలో నాగ చైతన్య కామియో రోల్ పోషించిన సంగతి తెలిసిందే. తాజగా తన పాత్ర గురించి నాగ చైతన్య స్పందించాడు.

    భయం వేసింది

    భయం వేసింది

    దర్శకుడు నాగి ఈ చిత్రంలో తాతగారి కామియో రోల్ చేయాలని అడగగానే కొంత భయం వేసిందని నాగచైతన్య తెలిపాడు. నాన్నని అడిగానే నిర్ణయం చెబుదామని అనుకున్నట్లు నాగచైతన్య తెలిపాడు.

    నాన్నని సాకుగా చూపించి

    నాన్నని సాకుగా చూపించి

    నాన్న ఎలాగు ఒప్పుకోరు.. ఇదే సాకుగా చూపించి నాగికి నో చెబుదామని అనుకున్నట్లు చైతు తెలిపాడు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు నాగి.. నేను చేయలేను అని చెబుదామని అనుకున్నట్లు చైతు తెలిపాడు. కానీ ఆ పాత్రలో నటించడానికి నాగార్జున ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

    500 టేక్స్ అయినా పరవాలేదు

    500 టేక్స్ అయినా పరవాలేదు

    టెస్ట్ షూట్ లో నాగ అశ్విన్ 13 టేక్స్ చేశాడు. ఈ పాత్ర కోసం 500 టేక్స్ అయినా పరవాలేదు అని తాను అనుకున్నట్లు చైతు తెలిపాడు. ఎలాగైనా ఈ పాత్రలో అందరూ మెచ్చేలా నటించాలని అనుకున్నట్లు చైతు తెలిపాడు. దర్శకుడు నాగ అశ్విన్ మాట్లాడుతూ నా పాట నీ నోటా పలకాల చిలక సాంగ్ చేస్తున్నప్పుడు చైతు మ్యాజిక్ చేశాడని నాగ అశ్విన్ తెలిపాడు

    క్లాస్ నుంచి గెంటేశారు

    క్లాస్ నుంచి గెంటేశారు

    15 ఏళ్ల క్రితం తాను క్లాస్ లో ఉండగా దేవదాసు సినిమా చూశావా అని అడిగారు. చూడలేదు అంటే క్లాస్ నుంచి గెంటేసి చూసి రా అని పంపించినట్లు చైతు తన అనుభవాన్ని వివరించాడు.

    కర్రతిప్పే సీన్

    దేవదాసులో కర్రతిప్పే సన్నివేశం ఉంటుంది. ఆ సన్నివేశం కొంత వరకూ బాగా వచ్చినా చాలు అని అనిపించినట్లు చైతు తెలిపాడు. ఈ చిత్రంలో తనది రెండు నిమిషాల పాత్రే అయినప్పటికీ జీవితంలో ఎప్పటికి మరచిపోలేని అనుభవం అని చైతు తెలిపాడు.

    English summary
    Naga Chaitanya About Mahanati Movie. Naga Chaitanya plays ANR cameo role
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X