రామ్ చరణ్, అల్లు అర్జున్ కంటే ఎన్టీఆర్ బెటర్..
హైదరాబాద్: టాలీవుడ్లో బెస్ట్ డాన్సర్స్ ఎవరంటే...ముందుగా అల్లు అర్జున్, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తాయి. మరి ఈ ముగ్గురిలో ఎవరు బెస్ట్ అంటే....ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో రకంగా ఉంటుంది. ఇదే విషయాన్ని అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ను అడిగితే తన ఓటు ఎన్టీఆర్ కే అంటున్నాడు.
తన తాజా సినిమా ‘ఒక లైలా కోసం' ప్రమోషన్లో భాగంగా ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న నాగ చైతన్యకు ఈ ప్రశ్న ఎదురవ్వగా....తన దృష్టిలో అల్లు అర్జున్, రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ బెస్ట్ డాన్సర్ అని సమాధానం ఇచ్చారు. ఆ సంగతి పక్కన పెడితే నాగ చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం' చిత్రం అక్టోబర్ 17న విడుదలవుతోంది. ఈ సినిమా విడుదలపై చాలా ఎగ్జైంటింగుగా ఉన్నాడు నాగ చైతన్య.

‘ఒక లైలా కోసం' చిత్రంలో నాగచైతన్య సరసన పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటిస్తోంది. విజయ్‌కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. నాగార్జున నిర్మాత. అలీ, సాయాజీ షిండే, రోహిణి, సుమన్, సుధ, చలపతిరావు, ఎం.ఎస్.నారాయణ, అన్నపూర్ణ, శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్, శుభలేఖ సుధాకర్, భరత్‌రెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు.
ఈ సినిమాకు కెమెరా: ఐ.ఆండ్రూ, సంగీతం: అనూప్ రూబెన్స్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, విజయ్, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: విజయ్‌కుమార్ కొండా.'


Click it and Unblock the Notifications











