Don't Miss!
- News షర్మిలపై జగన్ కామెంట్స్ ! చంద్రబాబు కౌంటర్-సజ్జల ఎన్ కౌంటర్..!
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports అతని వల్లే RCB టైటిల్ చేజారింది- అనిల్ కుంబ్లే
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రోమ్‌లో అఖిల్ మ్యారేజ్, అప్పుడు మెచ్యూరిటీ లేకనే అలా : నాగ చైతన్య
హైదరాబాద్: నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాహసం శ్వాసగా సాగిపో'. ఈ సినిమాను నవంబర్ 11న విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీ అయ్యారు నాగ చైతన్య.
ఈ చిత్రాన్ని మిర్యా సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ బేనర్‌పై గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు తన వివాహం, అఖిల్ వివాహం గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
లేటయినా...
సాహసం స్వాసగా సాగిపో సినిమా విడుదల అనుకున్నదానికి కంటే చాలా లేటయింది. గతేడాది డిసెంబర్‌లో విడుదల చేద్దామని అనుకున్నాం కానీ రెండు లాంగ్వేజస్‌లో షూటింగ్ చేయడం కారణం ఒకటైతే, మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేయడం వల్ల సినిమా ఇంత ఆలస్యమైందని నాగ చైతన్య తెలిపారు.
టెన్షన్ లేదు
సినిమా ఆలస్యమైనా ఎలాంటి సమస్య ఉండదనే భావిస్తున్నాం. ఈ సినిమా విషయమై ఎలాంటి టెన్షన్ లేదు. సినిమా మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం అందరిలోనూ ఉంది. నా కెరీర్లోనే ఇది డిఫరెంట్ మూవీ అని నాగ చైతన్య తెలిపారు.
ప్రేమమ్ తో పోలిక వద్దు
ప్రేమమ్ కంటే ముందుగానే సాహసం శ్వాసగా సాగిపో సినిమా రిలీజ్ కావాల్సింది... కానీ ప్రేమమ్ తర్వాత రిలీజైంది. ఆ సినిమాకు ఈ సినిమాకు అస్సలు పోలిక ఉండదు. ఈ రెండు సినిమాలు నటుడిగా నాకు సంతృప్తిని ఇచ్చాయి అని చైతూ తెలిపారు.
సినిమా కాన్సెప్ట్ గురించి
ఓ కుర్రాడు రెండు వేర్వేరు పరిస్థితుల్లో ఎలా ఉంటాడోనని చూపిస్తుంది. ఫస్టాఫ్ అంతా ఏ మాయ చేసావే సినిమాకు ఎక్స్‌టెన్షన్‌గా కనపడుతుంది. ఇక సెకండాఫ్ ఘర్షణ స్టయిల్లో సస్పెన్స్ థ్రిల్లింగ్‌గా సాగుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి ఓ సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య నుండి ఆ అమ్మాయిని కాపాడటానికి ఎలాంటి సాహసం చేశాడనేదే కథ... చైతన్య తెలిపారు.
గౌతమ్ మీనన్ గురించి
గౌతమ్ మీనన్ నా ఫేవరెట్ డైరెక్టర్. ఆయతో చేసిన ఏమాయ చేసావె తర్వాత ఆడియెన్స్ నున్న లవ్‌స్టోరీస్‌లో యాక్సెప్ట్ చేశారు. ఈ సినిమా తర్వాత ఆడియెన్స్ నన్ను యాక్షన్ జోనర్ సినిమాలకు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆయన నన్ను అలా కొత్తగా ప్రెజెంట్ చేశారు.
అప్పుడు నాకు మెచ్యూరిటీ లేక పోవడం వల్లే
ఈ సినిమాలో ఇప్పటి వరకు చేయని బాడీ లాంగ్వేజ్‌తో కనిపిస్తాను. నేచురల్ యాక్షన్ పార్ట్‌తో సినిమా సాగుతుంది. కెరర్ బిగినింగ్‌లో నేను కొన్ని యాక్షన్ సినిమాలు చేసాను. అపుడు స్క్రిప్టు సెలక్షన్ విషయంలో సరైన మెచ్యురిటీ లేక పోవడం వల్లే అవి హిట్ కాలేదనుకుంటున్నాను అని చైతన్య తెలిపారు.
అఖిల్, తన పెళ్లి గురించి
అఖిల్ మ్యారేజ్ ఇటలీలో జరుగుతుంతన్న వార్తలు నిజమే. ఇటలీలోని రోమ్ సిటీలో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ ఉంటుంది. మేలో పెళ్లి ఉంటుంది. అఖిల్ పెళ్లి తర్వాతే నా వివాహం ఉంటుంది..మా పెళ్లి చర్చిలొ జరుగొచ్చు. తర్వాత గుళ్లొ కూడా చేసుకుంటాం.... అని నాగ చైతన్య స్పష్టం చేసారు.
నెక్ట్స్ ఇయర్ టార్గెట్
తమిళ హీరోలు ఇక్కడ ట్రై చేస్తున్నట్లే మనం కూడా తమిళంలో సినిమాలు చేయాలనే ప్లాన్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది నా టార్గెట్ అదే. గౌతమ్‌గారి నెక్ట్స్ మూవీలో తెలుగు, తమిళంలో నేనే చేస్తానని అడిగాను, ఆయన కూడా ఓకే చెప్పారు అని చైతూ తెలిపారు.
నెక్ట్స్ మూవీ
కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నా నెక్ట్స్ మూవీ ఉంటుంది. నవంబర్ 9 నుండి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది పంజాబీ రీమేక్ అనే వార్తల్లో నిజం లేదు. కల్యాణ్ కృష్ణ స్వయంగా తయారుచేసుకున్న కథ. టైటిల్ ఏమీ అనుకోలేదు అని చైతూ తెలిపారు.
హలో బ్రదర్
హలోబ్రదర్ రీమేక్ చేద్దామనుకున్నాం కానీ చివరకు హలో బ్రదర్ సినిమా క్లాసిక్ కావడం, ఆ రేంజ్‌లో నేను నటించలేను కాబట్టి రీమేక్ ఆలోచన మానుకున్నాను అని ఓ ప్రశ్నకు చైతన్య సమాధానం ఇచ్చారు.
సాహసం శ్వాసగా సాగిపో..... చకోరి సాంగ్
సాహసం శ్వాసగా సాగిపో..... చకోరి సాంగ్ ను ఇక్కడ వీడియో ఆస్వాదించండి.
తను నేను సాంగ్
సాహసం స్వాసగా సాగిపో... తను నేను సాంగ్ ను ఇక్కడ వీడియోలో వినండి.
వెళ్లిపోమాకే సాంగ్
సాహసం స్వాసగా సాగిపో .... వెళ్లిపోమాకే సాంగ్ ను ఈ వీడియోలో వినండి.