»   » సమంత కోపంగా చూస్తుంది, పోట్లాడలేదు: నాగ చైతన్య

సమంత కోపంగా చూస్తుంది, పోట్లాడలేదు: నాగ చైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే. 'ఏమాయ చేశావె' సినిమా సమయంలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి చివరకు పెళ్లి వరకు వచ్చేశారు.

ఇప్పటికే ఈ జంటకు నిశ్చితార్థం జరుగ్గా.... అక్టోబర్ మొదటి వారంలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య సమంత గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

మొదట గుర్తొచ్చేది సమంత

మొదట గుర్తొచ్చేది సమంత

సమంత ప్రపంచంలోనే అందరికన్నా అందమైన అమ్మాయి అని, సమంత అనగానే తనకు మొదట గుర్తుకొచ్చేది ప్రపంచంలోనే ఓ గొప్ప మనిషి అని తన కాబోయే భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు చైతూ.

ఎప్పుడూ పోట్లాడలేదు

ఎప్పుడూ పోట్లాడలేదు

నా విషయంలో సమంతకు ఏదైనా కోపం వస్తే.... సీరియస్‌గా ఫేసు పెట్టి చూస్తుందని, ఎప్పుడూ పోట్లాడటం లాంటివి చేయలేదని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. పోట్లాడుకునేంత పెద్ద గొడవలు తమ మధ్య ఎప్పుడూ రాలేదని చైతూ చెప్పుకొచ్చాడు.

అప్పుడు, ఇప్పుడూ ఒకేలా ఉన్నాం

అప్పుడు, ఇప్పుడూ ఒకేలా ఉన్నాం

మొదటి నుండి మా మధ్య స్నేహం ఉంది. ఒకరిపై ఒకరు ఇష్టంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. నిశ్చితార్థం తర్వాత మా ఇద్దరిలో ఎలాంటి మార్పులు రాలేదు. అప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడూ అలానే ఉన్నామని నాగ చైతన్య తెలిపారు.

మాపై సినిమా తీస్తే అభ్యంతరం ఉండదు

మాపై సినిమా తీస్తే అభ్యంతరం ఉండదు

మీ లవ్ స్టోరీని సినిమాగా తీస్తానంటే ఎలా స్పందిస్తారు అనే ప్రశ్నకు నాగ చైతన్య స్పందిస్తూ....ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదని నాగ చైతన్య తెలిపారు.

చైతన్య సమంతల పెళ్ళి కార్డు రెడీ అయిపోయింది: ఇదిగో చూసేయండి

చైతన్య సమంతల పెళ్ళి కార్డు రెడీ అయిపోయింది: ఇదిగో చూసేయండి

మొత్తానికి వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖ సిద్ధం అయింది. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-శామ్ ల పెళ్లి జరుగనుంది. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది.

పెళ్లి శుభలేఖ ఫోటోలు చూసేందుకు క్లిక్ చేయండి

సెక్స్, ఫుడ్... హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్!

సెక్స్, ఫుడ్... హీరోయిన్ సమంత షాకింగ్ కామెంట్!

హీరోయిన్ సమంత ఇటీవల జెఎఫ్‌డబ్ల్యు మేగజైన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ప్రశ్నలకు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

చైతూతో ఆల్రెడీ పెళ్లయింది, చాలా వరస్ట్, చెర్రీ కిల్లింగ్ ఇట్: సమంత ట్వీట్ చాట్

చైతూతో ఆల్రెడీ పెళ్లయింది, చాలా వరస్ట్, చెర్రీ కిల్లింగ్ ఇట్: సమంత ట్వీట్ చాట్

చైతూతో ఆల్రెడీ పెళ్లయింది, చాలా వరస్ట్, చెర్రీ కిల్లింగ్ ఇట్...... అంటూ సమంత చేసిన ట్వీట్ చాట్ హాట్ టాపిక్ అయింది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
South actor Naga Chaitanya is expected to marry Samantha Ruth Prabhu, his colleague and fiancee, in October this year. The 30-year-old actor revealed in an interview to news agency that he's clearly enjoying the current phase when he's being asked about his impending wedding.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu