»   » సమంత మతం మార్పిడి ఇష్యూ: నాగ చైతన్య ఏమన్నారంటే...

సమంత మతం మార్పిడి ఇష్యూ: నాగ చైతన్య ఏమన్నారంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య, సమంత ప్రేమకు అక్కినేని ఫ్యామిలీ పచ్చజెండా ఊపడంతో పెళ్లికి సిద్ధమయ్యారు ఈ జంట.

అయితే నాగ చైతన్య హిందూ మతానికి చెందిన వాడు కావడం... సమంత క్రిస్టియన్ మతానికి చెందిన అమ్మాయి కావడంతో వీరి వివాహం ఏ సాంప్రదాయం ప్రకారం జరుగుతుందనే చర్చ కొంత కాలంగా జరుతోంది. వాస్తవానికి వారిద్దరికీ ఇలాంటి మత పట్టింపులు లేక పోయినా... బయట మాత్రం దీని గురించే అభిమానులు చాలా మందే ఉన్నారు.

సమంత మతం మార్చుకుందంటూ న్యూస్

సమంత మతం మార్చుకుందంటూ న్యూస్

ఆ మధ్య సమంత అక్కినేని ఇంట్లో ఏదో పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫోటోలు లీక్ అయ్యాయింది. దీంతో సమంత హిందూ మతంలోకి మారిందంటూ వార్తలు షికార్లు చేసాయి. ప్రియుడి కోసం సమంత ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని అంతా నిజమే అనుకున్నారు.

నాగ చైతన్య స్పందన

నాగ చైతన్య స్పందన

సమంత మతం మార్చుకుందనే వార్తలపై నాగ చైతన్య స్పందించాడు. ఈ వార్తలు రావడానికి కారణమైన సదరు ఫోటోలపై కూడా చైతూ వివరణ ఇచ్చాడు. మతం మార్చుకున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం, తమకు అలాంటి అవసరం కూడా లేదని స్పష్టం చేసాడు.

ఆ ఫోటోస్ ఏమిటి?

ఆ ఫోటోస్ ఏమిటి?

సమంత మతం మార్చుకున్నట్లు ప్రచారమవుతున్న ఫోటోలు అన్నపూర్ణ స్టూడియోలో పూజకు సంబందించినవే తప్ప... మతం మార్చుకోవడాల్లాంటివేమీ జరుగలేదని నాగ చైతన్య స్పష్టం చేసారు. దీనిపై అనవసర రాద్దాందం చేయొద్దన్నారు.

నాన్నగారు కోసమే పూజలో

నాన్నగారు కోసమే పూజలో

అన్నపూర్ణ స్టూడియోలో నాన్నగారు ఏదో పూజ చేస్తున్న సమయంలో అనుకోకుండా మేమిద్దరం అదే సమయానికి అక్కడికెళ్లాం. అక్కడే ఉన్నాం కాబట్టి ఫార్మాలిటీగా మమ్మల్ని కూడా పూజలో కూర్చోమన్నారు, నాన్నగారి మాట కాదనలేక పూజలో కూర్చున్నామని తెలిపారు నాగ చైతన్య.

నిశ్చితార్థం జరుగేలేదు

నిశ్చితార్థం జరుగేలేదు

కొందరు ఈ ఫోటోలు చూసి మాకు నిశ్చితార్థం జరిగిందని అంటున్నారు. అందులో కూడా వాస్తవం లేదు. మాకు నిశ్చితార్థం జరుగలేదు, సమంత మతం కూడా మార్చుకోలేదు.... మేము పెళ్లి చేసుకుంటున్నాం అని ప్రకటించాం. అలాంటపుడు నిశ్చితార్థం రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాగ చైతన్య తేల్చి చెప్పారు.

మతం పట్టింపులు లేవు

మతం పట్టింపులు లేవు

మా ఇద్దరికీ మతం పట్టింపులు లేవు. మాలో అలాంటి ఉద్దేశ్యం ఉంటే మా బంధం మేము ఇక్కడికి వరకు వచ్చేదే కాదు. మాకు ఏ మతమైనా ఓకే అని. వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించడం, గౌరవించడం చేస్తాను తప్ప మతం మార్చుకోమనడమో, ఇంకేదో లాంటి కండిషన్స్ పెట్టనని చైతు స్పష్టం చేసారు.

English summary
Naga Chaitanya about Samantha Religion change. Chay has denied these rumours saying that pooja was performed in Nahagruja Studios and firmly said that that religion doesn’t act as an impediment for him
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu