చైతు కామెంట్స్... మహేష్ బాబుపైకి మళ్లించారు!
హైదరాబాద్ : నాగ చైతన్య, తమన్నా, సునీల్, ఆండ్రియా ప్రధాన తారాగణంగా రూపొందిన 'తడాఖా' చిత్రం ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో పలు పత్రికల్లో నాగ చైతన్య ఇంటర్వ్యూలు ప్రచురితం అయిన సంగతి తెలిసిందే. అంతా సోషల్ నెట్వర్కింగ్‌లో అభిమానులకు తచ్ లో ఉంటున్నారు, మీరు మాత్రం దానికి దూరంగా ఉంటున్నారు అని అడిగిన ప్రశ్నకు....నాగచైతన్య ఇచ్చిన సమాధానం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
'చాలా మంది సోషల్ నెట్వర్కింగ్ సైట్లను తమ సినిమాల ప్రమోషన్ కోసమే ఉపయోగించుకున్నారు. నా దృష్టిలో నా సినిమాలు వాటికి అవే పబ్లిసిటీ సొంతం చేసుకుంటాయి. అలాంటప్పుడు సోషల్ నెట్వర్కింగ్‌లపై ఆధారపడాల్సిన పని లేదు' అని సమాధానం ఇచ్చారు నాగ చైతన్య.
అయితే...నాగ చైతన్య వ్యాఖ్యాలను కొందరు మహేష్ బాబుకు ఆపాదించి, ఆ వ్యాఖ్యలు మహేష్ బాబు లాంటి వారికి సెటైర్ల లాంటివని ప్రచారం మొదలు పెట్టారు. నాగ చైతన్యకు అలాంటి ఉద్దేశ్యం ఉందో లేదో తెలియదు కానీ, గాసిప్ రాయుళ్లు మాత్రం ఈ విషయంలో తెగ హడావుడి చేస్తున్నారు ఫిల్మ్ నగర్లో.
తడాఖా సినిమా విషయానికొస్తే....తమిళంలో మాధవన్, ఆర్య హీరోలుగా రూపొంది సూపర్ హిట్టయిన 'వెట్టై' చిత్రాన్ని తెలగులో 'తడాఖా' పేరుతో రీమేక్ చేసారు. డాలి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని బెల్లంకొండసురేష్ నిర్మించారు. సునీల్ మాధవన్ పాత్రలో పిరికి పోలీస్‌గా, నాగ చైతన్య ఆర్య పాత్రలో తమ్ముడిగా నటించాడు.


Click it and Unblock the Notifications











