గీతా ఆర్ట్స్ బ్యానర్లో నాగచైతన్య మరో సినిమా
నాగచైతన్య హీరోగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన 100%లవ్ సినిమా భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే బ్యానర్లో నాగచైతన్య మరో సినిమా చేయబోతున్నారు. ఈచిత్రానికి రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించబోతున్నారు. రవికుమార్ చౌదరి గతంలో 'యజ్ఞం', 'వీర భద్ర' చిత్రాలకు దర్శకత్వం వహించారు. బన్నీ వాసు ఈ చిత్రానికి నిర్మాత.
ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో 'గౌరవం' అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు. ఈ రెండు చిత్రాల తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్లో సినిమా చేసే అవకాశం ఉంది.
దడ, బెజవాడ వరుస ప్లాపులతో వెనకబడ్డ నాగచైతన్య తర్వలో విడుదలకు సిద్ధం కాబోతున్న 'ఆటో నగర్ సూర్య' చిత్రంపైనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











