twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగచైతన్య సరసన కాజల్ ఖరారు

    By Srikanya
    |

    హైదరాబాద్: గతంలో నాగచైతన్య, కాజల్ కాంబినేషన్ లో దడ చిత్రం వచ్చి హిట్టైంది. తాజాగా ఇదే కాంబినేషన్ లో మరో చిత్రం తెరకెక్కనుంది. నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన 'హలో బ్రదర్‌' చిత్రాన్ని అదే పేరుతో పునర్నిర్మించబోతున్నారు. ఇందులో ఓ హీరోయిన్ గా కాజల్‌ని ఎంపిక చేసుకొన్నట్లు సమాచారం. శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వం వహిస్తారు. డి.శివప్రసాద్‌రెడ్డి నిర్మాత. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    నాగార్జున కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' సినిమాది టాప్ ప్లేస్. నాగార్జున-ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో 1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ దేవాగా దొంగ పాత్రలో, రాక్ స్టార్‌గా రవి పాత్రలో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరించాడు. నాగార్జున తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా కూడా ఇదే.

    నాగచైతన్య వరసగా రీమేక్స్ చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడెక్కడ రీమేక్ లు అతని వద్దకు వచ్చి వాలుతున్నాయి. తాజాగా కన్నడంలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఛార్మినార్ చిత్రం రీమేక్ కోసం అతన్ని సంప్రదించినట్లు సమాచారం. ఛార్మినార్ చిత్రం చూసి నాగచైతన్యకు నచ్చినట్లైతే లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు. కన్నడంలో డైరక్ట్ చేసిన దర్శకుడే తెలుగులోనూ డైరక్ట్ చేయనున్నారు. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

    మరో ప్రక్క నాగచైతన్య వరసగా రీమేక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తమిళంలో హిట్టైన వెట్టై ని సునీల్ తో కలిసి చేస్తున్నారు. నాగచైతన్య, సునీల్‌ హీరోలుగా శ్రీసాయి గణేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఓ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ హిట్ వెట్టై రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి 'చిన్నోడు-పెద్దోడు' అనే టైటిల్ ని ఖరారు చేసే అవకాసం ఉందని సమాచారం.

    English summary
    Naga Chaitanya is going to act in a film titled 'Hello Brother' in the direction of Srinivasa Reddy. The film is a remake of his father Nagarjuna's super hit comedy film 'Hello Brother', under legendary E.V.V.Satyanarayana's direction that came in 1994. The latest news is that Kajal Agarwal is going to pair up with Naga Chaitanya in this film. The second pair is yet to be finalized. This is the pair's second film after 'Dada'. The film is to be produced by D.Siva Prasad Reddy under Kamakshi Movies banner. The cast and crew of the film will be announced soon.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X