»   » నాన్న పుట్టినరోజున నాగ చైతన్య, అఖిల్ ఏం చేసారో చూడండి (ఫోటోస్)

నాన్న పుట్టినరోజున నాగ చైతన్య, అఖిల్ ఏం చేసారో చూడండి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నాగార్జున ఫోటోతో కూడిన స్పెషల్ పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసారు. నిర్మలా కాన్వెంట్‌ సినిమాలో నాగార్జున పాట పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటకు సంబంధించిన నాగార్జున స్టిల్‌, తాజ్ మహల్ పిక్‌తో కలిపిఈ స్టాంపులు ముద్రించారు.

నాగార్జున స్పెషల్ పోస్టల్ స్టాంప్‌లను ఆయన ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్‌ల మీదుగా విడుదల చేసారు. సుమారు 10వేల పోస్టల్ స్టాంపులు ముద్రించారు. సోమవారం మధ్యాహ్నం నుండి వివిధ పోస్టాఫీసుల్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి.

కాగా....నాగార్జున ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ తన ఫోటోలతో పోస్టల్ స్టాంపులు రిలీజ్ కావడం తన లైఫ్ లో బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ అని, అభిమానులకు, ఇండస్ట్రీకి థాంక్స్ చెబుతున్నట్లు నాగార్జున వ్యాఖ్యానించారు.

పోస్టల్ స్టాప్ రిలీజ్ కార్యక్రమంలో పలువురు అక్కినేని అభిమాన సంఘాల నాయకులు పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్, నాగార్జున సినీ జీవితానికి సంబంధించిన విశేషాలు స్లైడ్ షోలో...

నాగార్జున పోస్టల్ స్టాంప్స్

నాగార్జున పోస్టల్ స్టాంప్స్

నాగార్జున ఫోటోతో రిలీజైన పోస్టల్ స్టాంపులు ఇవే.

చైతన్య, అఖిల్

చైతన్య, అఖిల్

నాగార్జున పోస్టల్ స్టాంపులు రిలీజ్ చేస్తున్న ఆయన ఇద్దరు కుమారులు చైతన్య, అఖిల్.

నాగార్జున సినీ జీవిత విశేషాలు

నాగార్జున సినీ జీవిత విశేషాలు

నాగార్జున మొదటి చిత్రం విక్రం, మే 23, 1986లో విడుదల అయింది.

తండ్రితో కలిసి

తండ్రితో కలిసి

నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టరుగారి అబ్బాయి చిత్రంలో నటించారు.

తొలి విజయం

తొలి విజయం

సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం.ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

గీతాంజలి

గీతాంజలి

మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం.

శివ

శివ

మరియు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ. ఈ చిత్రం భారీ విజయం తర్వాత నాగార్జున స్టార్ హీరో అయ్యారు. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టారు.

కొత్తవారు

కొత్తవారు

నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు తెచ్చుకున్నాడు.

భక్తిరస చిత్రాలు

భక్తిరస చిత్రాలు

లవ్, యాక్షన్ సినిమాలే కాదు... భక్తి రస చిత్రాలు కూడా తాను అద్భుతంగా చేయగలనని ‘అన్నమయ్య'తో నిరూపించారు నాగార్జు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచినది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడి గా నంది అవార్డు అందుకున్నారు.

హ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

నేడు 57వ పుట్టినరోజు జరుపుకుంటున్న నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.

English summary
Nagarjuna's Birthday Stamp launched on Monday by his sons Naga Chaitanya and Akhi. The "stamp" features a portrait of Nagarjuna as a singer alongside the mystic Taj Mahal.
Please Wait while comments are loading...