నాగ చైతన్యతో మారుతి సినిమా ప్రారంభం
నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అ
Recommended Video

నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది.

టైటిల్ అనగనగా ఓ ప్రేమకథ
ఈ చిత్రానికి టైటిల్‌ను ఖరారు చేయలేదు. ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, పీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.

పూజాలో చిత్ర యూనిట్
దేవుడి పటాల వద్ద స్క్రిప్టు పెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో చైతూ, అను ఇమ్మాన్యుయేల్, మారుతి పాల్గొన్నారు. అనంతరం చైతన్య, అనుపై తొలిషాట్‌కు దిల్ రాజు క్లాప్ కొట్టారు.

చైతూ, అను ఇమ్మాన్యుయేల్
నాగ చైతన్య అక్కినేని సరసన 'అను ఇమ్మాన్యు యేల్' నాయికగా నటిస్తున్నారు. ఈరోజు మంచిరోజు కావటం తో ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది.

త్వరలోనే వివరాలు: మారుతి
జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని దర్శకుడు మారుతి తెలిపారు.


Click it and Unblock the Notifications











