సమంతతో పెళ్లి గుట్టు విప్పిన నాగచైతన్య.. తొలిసారి చైతూ నోటివెంట..
సమంతతో వివాహం తర్వాత అక్కినేని చైతన్య పెళ్లిపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. నా దాంపత్య జీవితం చాలా బాగున్నది అని చైతూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఓ షాప్‌ను ప్రారంభించిన చైతన్య మీడియాత
సమంతతో వివాహం తర్వాత అక్కినేని చైతన్య పెళ్లిపై పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. ఇంతకుముందు లైఫ్‌తో పోల్చుకుంటే నా దాంపత్య జీవితం చాలా బాగున్నది అని చైతూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఓ షాప్‌ను ప్రారంభించిన చైతన్య మీడియాతో మాట్లాడారు.

సమంతతో లైఫ్ బాగున్నది..
సమంతతో లైఫ్ చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే వైవాహిక జీవితానికి పూర్తి స్థాయిలో అలవాటుపడుతున్నాను. మ్యారేజ్ లైఫ్‌ను సూపర్‌గా ఎంజాయ్ చేస్తున్నాను అని తెలిపారు.

అఖిల్ హలోకు దూరంగా
ఇటీవలే చైతూ, సమంత హానీమూన్ ట్రిప్‌కు వెళ్లి వచ్చారు. ఆ కారణంగానే అఖిల్ నటించిన హలో చిత్ర ఆడియో ఆవిష్కరణకు దూరంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి వారిద్దరూ వీడియో సందేశాన్ని పంపారు.

క్రిస్మస్ సెలబ్రేషన్స్
కాగా, సమంత, చైతూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. క్రిస్మస్ సంబరాలు మొదలుపెట్టినట్టు సమంత వెల్లడించారు. క్రిస్మస్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.

సవ్యసాచి చిత్రంలో
చైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఆయన మారుతి దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తారు.

రంగస్థలం చిత్రంలో సమంత
సమంత ‘రంగస్థలం' చిత్రంలో రాంచరణ్ సరసన నటిస్తున్నారు. మరోపక్క ఆమె ప్రధాన పాత్రలో ‘మహానటి' రూపుదిద్దుకుంటోంది. విశాల్ సరసన ఆమె నటించిన ‘అభిమన్యుడు' జనవరి 26న విడుదలకు సిద్ధమైంది.

నిర్మాతగా సమంత
ఇటీవలే అక్కినేని వారి ఇంటి కోడలైన సమంత అప్పుడే ఆ కుటుంబం లక్షణాలను అందిపుచ్చుకుంటోంది. నాగచైతన్యను పెళ్లిచేసుకుని ఇలా అక్కినేని కుటుంబంలో అడుగుపెట్టిందో లేదో అప్పుడే నిర్మాతగా అవతారమెత్తేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఓ కన్నడ హిట్ మూవీ రీమేక్ హక్కులు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని సమాచారం.

యూటర్న్ చిత్రంలో
కన్నడలో యూటర్న్ అనే మిస్టరీ మూవీ 2016లో భారీ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాను రీమేక్ చేయాలని అక్కినేని సమంత భావిస్తోంది. రీమేక్ హక్కుల కోసం సమంత భర్త చైతన్యతో కలిసి ఇటీవల బెంగళూరు కూడా వెళ్లారు. నిర్మాతగా మారాలన్న సమంత నిర్ణయానికి భర్త నాగచైతన్య, మామయ్య నాగార్జున పూర్తి మద్దతు ఇస్తున్నారని ఫిలింనగర్ టాక్.


Click it and Unblock the Notifications











