Samantha సమంత కోసం నాగ చైతన్య వీడియో... ఏముంది భయ్యా ఫీల్.. నిమిషాల్లోనే లక్షల్లో వ్యూస్!
హీరో నాగ చైతన్య - హీరోయిన్ సమంత మళ్లీ కలిస్తే చూడాలని ఎన్నో వేల మంది అభిమానులను వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయినా వీరిద్దరు మాత్రం కొన్నేళ్లుగా ఒకరితో మరొకరు అస్సలు ఏమాత్రం సంబంధం లేకుండా ఒంటరిగా జీవిస్తున్నారు. కానీ వీరిద్దరు విడిపోయి ఇన్నేళ్లు అయినా వీరికి సంబంధించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అవుతూ ఉంటుంది.
అయితే తాజాగా చైతూ - సామ్ కలిసి ఉన్న ఓ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో వీరిద్దరి ఎమోషనల్ ఫీల్ ఉంది భయ్యా మనసును తాకుతోంది. ఈ వీడియో పోస్ట్ అయిన కాసేపట్లోనే వేల కొద్ది లైక్స్, కామెంట్లు వస్తున్నాయి. దీని గురించి పూర్తి కథనం స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..

నాగ చైతన్య - సమంత ఈ ఇద్దరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేశావే చిత్రంతో ఆన్‌స్క్రీన్‌పై ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ఈ జంట ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ కలిసి నటించారు. ఈ క్రమంలోనే రియల్ లైఫ్‌లోనూ ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. మ్యూచువల్గా ఎన్నో వేలాది మంది అబిమానులను సంపాదించుకున్నారు. అలా 2017లో వివాహం చేసుకున్న ఈ జంటకు ఏమైందో తెలీదు కానీ త్వరగానే విడిపోయారు.
వీరిద్దరు విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీరి గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది ఊరికే గుప్పుమంటుంది. ఎంతలా అంటే నిమిషాల్లోనే వైరల్ అవుతుంది. అందరూ దాని గురించే తెగ మాట్లాడుకుంటారు. అలా ఇప్పటివరకు ఈ జంటపై ఎన్నో రూమర్స్ పుట్టుకొచ్చాయి. అయినా ఎన్ని రూమర్స్ పుట్టుకొచ్చినా వీరిద్దరు మళ్లీ కలుస్తారని, అందుకే వేరే పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా జీవిస్తున్నారని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు.
అయితే, తాజాగా ఓ డై హార్డ్ ఫ్యాన్స్ చైతూ సామ్‌ను కలిపి ఒకే వీడియోలో ఉంచి ఎడిట్ చేశారు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుండడంతో పాటు నెటిజన్ల మనసును తాకుతోంది. అందులో చైతూ.. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాకదే.. కాస్త నవ్వే.. అంటూ తండేల్ సినిమాలోని డైలాగ్ చెప్తారు. అలా చైతూ పిలిచినప్పుడు, వెంటనే సమంత బాగా ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నట్టుగా చూపించారు. మొత్తానికి ఇద్దరి ఫీలింగ్స్‌ను అద్భుతంగా చూపిస్తూ వీడియోను ఎడిట్ చేశారు. ఒక సెకండ్ ఇది నిజమే అన్నట్టుగా అనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల కొద్ది వ్యూస్, వేల కొద్ది కామెంట్స్ వస్తున్నాయి.
ఇక ఈ వీడియో క్లిప్ చుసిన నెటిజన్లు, అభిమానులు కూడా బాగా ఎమోషనల్ అవుతున్నారు. సామ్ - చైతూ మళ్లీ కలిస్తే బాగుండు, ఇది నిజమైతే చూడాలని ఉంది, వీడియో చూస్తుంటే ఫీల్ మాములుగా లేదు భయ్యా, ప్రపంచం మొత్తం కోరుకునేది ఇదే.. మీరు మళ్లీ కలవాలని కోరుకుంటున్నాం అంటూ కామెంట్ సెక్షన్ బాక్స్‌ను నింపేస్తున్నారు. ఏదేమైనప్పటికీ భవిష్యత్‌లోనైనా ఈ జంట కలవాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే..


Click it and Unblock the Notifications











