For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ్ ఇంట్లో సమంత, చైతూ పూజ (ఫొటోలు) , సమంత మతం మారిందా?

  By Srikanya
  |

  హైదరాబాద్: నాగచైతన్య, సమంత ల మధ్య ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చి, వివాహానికి ఇరు వైపుల పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో తాజాగా ఓ రెండు ఫొటోలు సోషల్ మీడియా లో హంగామా క్రియేట్ చేస్తున్నాయి. మీరు ఆ రెండు ఫొటోలును క్రింద చూడవచ్చు.

  ఆ ఫొటోలలో సమంత, నాగచైతన్య కలిసి పూజలో పాల్గొని కనిపించారు. దాంతో రకరకాల అనుమానాలు, ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి. దానికి తోడు ఈ పూజ ఉన్నచోట వెనక నాగార్జున కూడా ఉన్నారు. కుటంబ రీత్యా క్రిష్టియన్ అయిన సమంత రుతు ప్రభు..హిందూ మతంలోకి మారిందా అంటూ మీడియాలో కూడా వార్తలు మొదలయ్యాయి.

  ఈ ఫొటోలలో చైతన్య, సమంత ఇద్దరూ కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే చాప మీద కూర్చున్నారు. పక్కన నాగార్జున కూడా ఉన్నారు. మామూలుగా అయితే వీళ్లు ముగ్గురూ ఒకచోట ఉండటం పెద్ద విశేషం కాకపోయినా.. సమంత కుంకుమ బొట్టు పెట్టుకోవడంతోనే అందరూ ఆమె హిందూ మతం పుచ్చుకుందని చెబుతున్నారు. అయితే ఇది మీడియా వారు చేస్తున్న ఊహాగానమేనా..నిజం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది.

  ఫొటోలతో పాటు మరిన్ని విశేషాలు క్రింద చదవండి....

  వేదమంత్రలు సాక్షిగా

  వేదమంత్రలు సాక్షిగా

  హిందూ మతంలోకి సమంత మారిందా అనే వారి వాదనకు మరింత బలం సమకూర్చేలా వెనకాల కొందరు పురోహితులు కూడా నిలబడి ఉన్నారు. ఈ ఫొటో అనేక ప్రశ్నలకు, సమాధానాలకు తావిస్తోంది. ఎవరికి తోచినట్లు వారు ఊహించుకుంటున్నారు. క్యాజువల్ గా నాగార్జున ఫ్యామిలీలో జరిగిన పూజలో వీరు పాల్గొన్నారని, కాబోయే కోడలిగా ఆమె పూజలో పాల్గొంది అంటున్నారు.

  మతం విషయమై?

  మతం విషయమై?

  మరో ప్రక్క 'ఘర్ వాప్సీ' లాంటి పూజా కార్యక్రమాల ద్వారా సమంత హైందవ మతంలోకి వచ్చేసిందని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. ఘర్ వాప్సీ అంటే తిరిగి పూర్వపు మతంలోకి రావటం అని అర్దం. ఈ కార్యక్రమం ఇదేనా అయ్యింటుందని అంటున్నారు. అయితే అధికారికంగా ఏ సమాచారం ఈ విషయమై లేదు. కాబట్టి ఎక్కవ ఈ విషయమై చర్చించటం అనవసరం.

  ఏ సంప్రదాయాన్ని అనుసరించి

  ఏ సంప్రదాయాన్ని అనుసరించి

  నాగార్జున కుటుంబం హిందువు కాగా సమంతది క్రిస్టియన్ కుటుంబం. ఇప్పుడు ఏ మత సంప్రదాయాన్ని అనుసరించి పెళ్లి జరిపించాలన్న చిన్న చర్చ తెరపైకి వచ్చిందని సమాచారం. నాగచైతన్య కుటుంబం హిందూ సంప్రదాయబద్ధంగా పెళ్లి నిర్వహించాలన్న అభిప్రాయాన్ని, సమంత కుటుంబం క్రిస్టియన్ మత సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో కాస్త అయోమయ పరిస్థితి నెలకొందని సమాచారం.

  దానికే రెండు కుటుంబాలు ఓటు

  దానికే రెండు కుటుంబాలు ఓటు

  అయితే రెండు మతాల సంప్రదాయాలను గౌరవిస్తూ రెండు సార్లు నాగచైతన్య, సమంతల పెళ్లి నిర్వహిస్తే బాగుంటుందన్న సన్నిహితుల సలహాలను పాటించడానికి ఇరు కుటుంబాలు సమ్మతించినట్లు తెలిసింది. దాంతో అటు వైపు వారికి, ఇటు వైపు వారికి ఎవరికీ సమస్య ఉండని భావిస్తున్నారు. సమంత ఫ్యామిలీ కూడా ఈ విషయమై హ్యాపీగా ఉందిట

  చెన్నై, హైదరాబాద్ లలో

  చెన్నై, హైదరాబాద్ లలో

  ముందుగా నాగచైతన్య సొంత ఊరు హైదరాబాద్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపి,ఆ తరువాత సమంత సొంత ఊరు చెన్నైలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం రెండోసారి పెళ్లి నిర్వహించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  చైతూ క్లారిటీ ఇచ్చాడు

  చైతూ క్లారిటీ ఇచ్చాడు

  చెన్నైలో జరిగిన సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ లాంచ్ లో పాల్గొన్న నాగచైతన్య తన పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సమంతతో మీ పెళ్లి ఎప్పుడూ అంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. ప్రస్తుతానికి డేట్ ఫిక్స్ అవ్వలేదు. వచ్చే ఏడాదిలో ఉంటుంది అంటూ సమాధానం ఇచ్చాడు.

  నాగ్ మాత్రం ప్రకటించలేదు

  నాగ్ మాత్రం ప్రకటించలేదు

  అఖిల్ నిశ్చితార్ధం విషయంలో క్లారిటీ ఇచ్చిన నాగ్, పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి డేట్ ను మాత్రం ప్రకటించలేదు. దీంతో చాలా రోజులుగా నాగచైతన్య, సమంతల పెళ్లి విషయంలో రకారకాల వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అఖిల్ నిశ్చితార్ధం ముందుగా జరిగిన నాగచైతన్య పెళ్లి తరువాతే అఖిల్ పెళ్లి ఉంటుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

  మొత్తానికి మీడియా ముందు

  మొత్తానికి మీడియా ముందు

  ఇన్ని రోజులూ నాగచైతన్య పేరు చెప్పకుండా దాటవేసిన సమంత, ఇప్పుడూ ''యస్... 'చై'తో డేటింగ్‌లో ఉన్నాను'' అని ఓ తాజా ఇంటర్వ్యూలో ధైర్యంగా చెప్పారు. నాగచైతన్య ముద్దుపేరు 'చై'. సమంత ఈ విషయం చెప్పేటప్పుడు ఆమె ముఖం వెలిగిపోయింది. ఆమె చైతూతో హ్యాపీగా ఉంటానని చెప్పకనే చెప్పింది.

  ఇప్పుడు ఎందుకు మాట్లాడటం..

  ఇప్పుడు ఎందుకు మాట్లాడటం..

  నేనూ, చై (నాగచైతన్య) రిలేషన్‌షిప్ (డేటింగ్)లో ఉన్నాం. ఇందులో దాచడానికి ఏం లేదు. మాకు మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. పెళ్లి గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే.. మా కుటుంబాలకైనా సరే పెళ్లి తేదీ మూడు నెలల ముందే తెలుస్తుంది. పెళ్లికి ఇంకా చాలా టైమ్ ఉన్నప్పుడు మీడియాతో ఎందుకు మాట్లాడాలి? తెలుగులో నా ఫస్ట్ ఫిల్మ్ (ఏ మాయ చేసావె) అప్పట్నుంచి మేము ఫ్రెండ్స్‌మి (నవ్వుతూ..). పెళ్లి మాత్రం ఈ ఏడాది చేసుకోవడం లేదు.

  పెళ్లంటే వదిలేయాల్సిన పనిలేదు

  పెళ్లంటే వదిలేయాల్సిన పనిలేదు

  ఎనిమిదేళ్లుగా సినిమాల్లో నటిస్తున్నాను. సినిమాలు తప్ప నాకు ఇంకేమీ తెలీదు. పెళ్లంటే సినిమాల్లో నటించడం ఆపేయడమేనా? నేను సినిమాలను వదులుకోవాలనుకోవడం లేదు. ప్రస్తుతం నేను చేస్తున్న పని (యాక్టింగ్)ని ఎంకరేజ్ చేసే వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నాను. అటువంటి కుటుంబంలోకి వెళ్తున్నాను అంది సమంత.

  పెళ్లైనా హీరోయిన్ గానే...

  పెళ్లైనా హీరోయిన్ గానే...

  పెళ్లి తర్వాత దర్శక-నిర్మాతలు, ప్రేక్షకులు ఎలా చూస్తారనేది వారిష్టం. వాళ్లు ఈమె మాకొద్దని చెప్పేవరకూ నటిస్తూనే ఉంటా. బాలీవుడ్‌లో జరుగుతున్నది ఇక్కడ కూడా జరగాలి. కరీనా కపూర్, కాజోల్ తదితరులు పెళ్లైన తర్వాతా హిందీ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే కదా అంటూ చెప్పుకొచ్చింది సమంత.

  నా నావకు లంగరు

  నా నావకు లంగరు

  చైలో నాకు బాగా ఇష్టమైన అంశం ఏంటంటే.. (నవ్వుతూ..) గందరగోళమైన నా జీవితాన్ని నిలకడగా ఓ దారికి తీసుకొచ్చేది అతడే. నావకు లంగరు ఎలాగో నా జీవితానికి అతను అలా అంటూ కాస్త ఫిలాసఫకల్ టచ్ ఇచ్చింది సమంత. ఆమె చాలా నమ్మకంగా వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతోందని అర్దమవుతోంది.

  మూడు నెలల క్రితమే..

  మూడు నెలల క్రితమే..

  'నా ప్రేమ వ్యవహారం గురించి దాచాల్సిన అవసరం లేదు. నా తొలి తెలుగు చిత్రం నుంచే చైతూ(నాగచైతన్య) సన్నిహితుడయ్యాడు. మూడు నెలల క్రితమే మా ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. వాళ్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా మంచే జరుగుతోంది.

  చాలా సమయం ఉంది..నిజం లేదు

  చాలా సమయం ఉంది..నిజం లేదు

  ఇరు కుటుంబ పెద్దల ఆశీస్సులు మాకు లభించాయి. మంచి ముహూర్తం చూసి పెళ్లి ఎప్పుడన్నది పెద్దలే వెల్లడిస్తారు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది.ఈ ఏడాదే పెళ్లి అనే ప్రచారంలో నిజం లేదు అంటూ సమంత చెప్పుకొచ్చింది. ఆమె పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ చేయలేదని అంది. ఫిక్స్ అయ్యక మీడియాకు తెలియచేస్తానని చెప్పింది.

  నేను కంటిన్యూ అవ్వాలనే చైతూ

  నేను కంటిన్యూ అవ్వాలనే చైతూ

  సినిమాకు దూరం అవ్వాలన్న అంశం గురించి ఆలోచనే లేదు. చైతూ కూడా నేను నటనను కొనసాగించాలని కోరుకుంటున్నారు. సినిమాను ప్రేమించే కుటుంబంతో జీవితాన్ని పంచుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వివాహానంతరం నటిగా నన్ను అభిమానులు ఎలా ఆదరిస్తారో అన్న భయం లేకపోలేదు. అయినా వారు వద్దనే వరకూ నటిస్తూనే ఉంటాను.

  అఖిల్ స్పష్టత ఇచ్చాడు. చైతు లేదు

  అఖిల్ స్పష్టత ఇచ్చాడు. చైతు లేదు

  ''డిసెంబర్ 9న అఖిల్ నిశ్చితార్థం జరుగుతుంది. 'సమంతతో ప్రేమలో ఉన్నాను. త్వరలో పెళ్లి చేసుకుంటాను' అని చైతూ చెప్పాడు.కానీ, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో చెప్పలేదు. బహుశా.. వచ్చే ఏడాది ఉండొచ్చు.అఖిల్ స్పష్టంగా చెప్పడంతో నిశ్చితార్థం ఫిక్స్ చేశాం అని నాగార్జున చెప్పుకొచ్చారు.

  ఇక్కడ ఇబ్బంది అని అక్కడకు వెళ్లి మరీ..

  ఇక్కడ ఇబ్బంది అని అక్కడకు వెళ్లి మరీ..

  సమంత, నాగచైతన్య ప్రేమ విషయం బయటకు లీక్ అయ్యాక హైదరాబాద్ నాగ చైతన్య, సమంత కలిసి తిరుగుతూ మీడియాకు చిక్కడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇబ్బందిగా ఫీలైన ఈ జంట ఇటీవలే బెల్జియం వెళ్లి జాలీగా ఎంజాయ్ చేసి వచ్చారు. త్వరలో వీరి వివాహ తేదీ ఖరారు కానుంది.

  ఆ పెళ్లిలోనే నాగ్ ...

  ఆ పెళ్లిలోనే నాగ్ ...

  ఆ మధ్య జరిగిన నిమ్మగడ్డ ప్రసాద్ వివాహంలో నాగార్జున స్వయంగా అందరికీ తన కోడలు సమంత అని పరిచయం చేసారు. అదే పెళ్లిలో సమంత, అమల కూడా కలిసి చాలా సేపు మాట్లాడుకున్నారు. అలాగే అక్కడ సమంత, నాగచైతన్యలు కలిసి మాట్లాడుకోవటం, కలిసి తిరగటం అందరి దృష్టినీ ఆకర్షించింది.

  ఎక్కడా రివీల్ చెయ్యలేదు

  ఎక్కడా రివీల్ చెయ్యలేదు

  నాగచైతన్య అయితే మొదటి నుంచి ఈ ప్రేమ,పెళ్లి విషయంలో కొంత రిజర్వ్ డ్ గానే ఉన్నాడు. తమ ఎఫైర్ గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఎక్కడా రివీల్ చేయలేదు. ఫైనల్ డెసిషన్ డాడీదే అని చైతూ చెప్పినట్టు తెలిసింది. నాగచైతన్యతో తన పెళ్లి గురించి మొన్నటి వరకూ కాస్త హడావుడి చేసిన సమంత కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయింది.

  టాటూలతోనే ప్రేమ రివీల్

  టాటూలతోనే ప్రేమ రివీల్

  సమంత ఆ మధ్యన బెంగుళూరులోని బహర్ కేఫ్ ప్రారంభోత్సవానికి హాజరు కాగా వీకెండ్‌ని బిర్యానితో ఎంజాయ్ చేసింది. కేఫ్ ప్రారంభోత్సవ సమయంలో సమంత చేతికి ఓ టాటూ కనిపించగా సేమ్ టాటూ చైతూ చేతికి కూడా ఉంది. ఇద్దరి రైట్ హ్యండ్స్‌పై ఒకేలా ఆ టాటూ ఉండడంతో తమ ప్రేమకు గుర్తుగా ఈ టాటూ వేయించుకున్నట్టున్నారని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపించారు.

  English summary
  Recently a Pic of Naga Chaitanya and Samantha Pooja at home was out along with Nagarjuna beside them. This auspicious Pooja was done under Veda pandits which shows that the date of marriage will be confirmed Soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X