కొత్త కోడలితో అక్కినేని ఫ్యామిలీ.. శోభిత పేరెంట్స్‌తో చైతూ.. సెన్సేషన్ అవుతోన్న ఫొటోలు
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ న్యూస్ ఒకటి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా కాలంగా సీక్రెట్‌గా లవ్ ట్రాకును నడుపుతోన్న ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది.
అప్పటి నుంచి వీళ్లిద్దరి గురించి ఎన్నో రకాల అంశాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు కూడా బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల ఫ్యామిలీ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి. వాటిని మీరే చూసేయండి మరి!

శోభితతో సీక్రెట్‌గా ట్రాక్
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీళ్లు నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి నాగ చైతన్య.. శోభిత ధూళిపాళ్లతో లవ్ ట్రాక్ మొదలు పెట్టాడు. అప్పట్లోనే ఈ విషయం బయటకు వచ్చింది. ఆ తర్వాత కూడా వీళ్లిద్దరూ జంటగా ఉన్న ఫొటోలు లీక్ అయ్యాయి.

పెళ్లి చేసుకుంటారంటూ
తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్య వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వచ్చినా.. దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా వీటిని పుకార్లుగానే చాలా మంది కొట్టిపారేశారు. అయితే, వీళ్లిద్దరూ ఫారెన్‌లో కలిసి దిగిన ఫొటోలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం ముమ్మరం అయింది.

ఎంగేజ్‌మెంట్ సర్‌ప్రైజ్
గతంలో కంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకోబోతున్నాడని వార్తలు ప్రచారం అయ్యాయి. అందుకు అనుగుణంగానే ఆగస్టు 8వ తేదీన వీళ్లిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. తద్వారా దీన్ని అధికారికంగా ప్రకటించేశారు.

శుభాకాంక్షలు.. ట్రెండ్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న నేపథ్యంలో ఈ జంటకు శుభాకాంక్షలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖులతో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో మంది సినిమా వాళ్లు విషెస్ చెబుతున్నారు. దీంతో నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఫ్యామిలీలతో ఫొటోలు
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత అక్కినేని నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్ల ఫొటోలను నాగార్జున షేర్ చేశారు. అయితే, తాజాగా వీళ్లిద్దరూ దిగిన ఫ్యామిలీ ఫొటోలు బయటకు వచ్చాయి. వీటిలో కొత్త జంటతో అక్కినేని, ధూళిపాళ్ల ఫ్యామిలీలు ఫోజులు ఇచ్చాయి. ఇందులో చైతన్య కుటుంబం అందరికీ పరిచయం ఉన్నా.. శోభిత ఫ్యామిలీ మాత్రం ఇప్పుడే పరిచయం అవుతోంది. దీంతో ఈ పిక్స్ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











