నా భార్య అవకాశం ఇస్తే అంటున్న చైతు, మరో లవ్ జర్నీ, సమంత తపించిపోతోంది!
Recommended Video

నాగ చైతన్య వెండి తెరపై మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా సక్సెస్ ఫుల్ జంట. సినిమాల్లో విజయవంతంగా తమ జర్నీ ప్రారంభించిన నాగ చైతన్య, సమంత.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమని గెలిపించుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. చై సామ్ ఇద్దరూ ప్రస్తుతం వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. సమంత తెలుగులో రంగస్థలం, తమిళంలో అభిమన్యుడు వంటి చిత్రాలలో నటిస్తోంది. నాగ చైతన్య సవ్యసాచి చిత్రంతో బిజీగా ఉన్నాడు. చై సామ్ కాంబినేషన్లో వివాహం తరువాత తొలి చిత్రం రాబోతోందంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. రియల్ లైఫ్ కపుల్ కలసి నటించబోతుండడంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది.

ఫస్ట్ మూవీతోనే మాయ
చై సామ్ కలసి నటించిన తొలి చిత్రం ఏం మాయ చేసావే. ఈ చిత్రంలో చై సామ్ నిజంగానే మాయ చేసారు. చై సామ్ ఇద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ పండింది.

మనంతో మళ్ళీ మ్యాజిక్
చైతు, సమంత ఏం మాయ చేశావే చిత్రం తరువాత మరో రెండు చిత్రాల్లో నటించారు. ఆటో నగర్ సూర్య చిత్రంలో జంటగా మెరిశారు. చై సామ్ మరో మారు నటించిన మనం చిత్రం క్లాసికల్ హిట్ గా నిలిచినది.

చిగురించిన ప్రేమ
కలసి నటిస్తున్న సమయంలోనే చై సామ్ మధ్య ప్రేమ చిగురించింది. చై సామ్ ప్రేమ వ్యవహారం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

వివాహబంధంతో ఒక్కటి
పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న చై సామ్ నిజ జీవితంలో కపుల్స్ గా మారారు.

చైతు, సమంత మరోసారి అంటూ వార్తలు
ఇటీవల చైతు సమంత కలసి మరో చిత్రంలో నటించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. సమంత, చైతు కలసి నటించడానికి రంగం సిద్ధం అయింది.
నాగచైతన్య ప్రకటన
తన భార్యతో కలసి నటించబోతున్న విషయాన్ని నాగ చైతన్య సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. నిన్ను కోరి చిత్రంతో విజయం సాధించిన దర్శకుడు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని చైతు తెలిపాడు. తన భార్య సమంతతో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నానని.. ఒకవేళ ఆమె అవకాశం ఇస్తే అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
తపించిపోతున్న సమంత
నాగ చైతన్య పోస్ట్ చేసిన ట్వీట్ ని రీట్వీట్ చేస్తూ, తాను ఈ చిత్రం కోసం ఎంతగా తపించి పోతున్నానో కామెంట్ రూపంలో తెలియజేసింది.

అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఈ చిత్రంపై అభిమానుల్లో ఇప్పటి నుంచే ఆసక్తి పెరిగిపోతోంది. భార్య భర్తలైన చై సామ్ వెండి తెరపై మెరవడానికి సిద్ధం అవుతుండడంతో ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











