»   » ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా నటిస్తున్నా...నాగచైతన్య

ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా నటిస్తున్నా...నాగచైతన్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాలేజీ యువత ఐడెంటిఫై అయ్యే కథ. ఇంజనీరింగ్ స్టూడెంట్‌గా నటిస్తున్నా అన్నారు నాగచైతన్య. నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బన్ని వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నాగచైతన్య సరసన నాయికగా తమన్నా నటిస్తోంది. చిత్రంషూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడారు.

అలాగే నిజానికి 'ఏమాయ చెసావె' తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ సినిమా చెయ్యాలనుకున్నా. కానీ ఈ కథ విన్నాక చాలా ఫ్రెష్‌గా ఉందనిపించింది. గీతా ఆర్ట్స్‌లో నటించే అవకాశం రావడం గౌరవంలాంటిది. ఈ చిత్రానికి గొప్ప టీమ్ కుదిరింది. ప్రతిభావంతులైన దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈ కథపై గట్టి నమ్మకంతో ఉన్నా అన్నారు నాగచైతన్య.

అనంతరం దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ... ఈ కథ విన్నవాళ్లంతా హీరో పాత్రకి నాగచైతన్య అయితే బాగుంటుందని చెప్పారు. హీరోయిన్‌గా మొదటే తమన్నాని అనుకున్నా. ఆ ఇద్దరూ ముద్దుముద్దుగా, ఫ్రెష్‌గా ఉన్నారు. నా సినిమాతో వాసు నిర్మాత కావడం సంతోషం. ఇది రొమాంటిక్ యాక్షన్ మూవీ అంటూ చెప్పుకొచ్చారు

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసి మార్చిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: జె. హరిప్రసాద్, రచన: చంద్రశేఖర టి. రమేశ్, రచనా సహకారం: అర్జున్-శ్రీను, ఛాయాగ్రహణం: ప్రసాద్, కళ: ఎ.ఎస్. ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఏడిద రాజా, ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్: సత్య, కథ, దర్శకత్వం: సుకుమార్.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu