చంచల్ గూడా జైల్లో ఖైదీగా నాగచైతన్య
నాగచైతన్య ఖైధీ గెపట్ లో కనపించే సన్నివేశాలను ఈ రోజు హైదరాబాద్ చంచల్ గూడా జైల్లో షూట్ చేసారు. దేవకట్టా దర్సకత్వంలో రూపొందుతున్న ఆటో నగర్ సూర్య కోసం ఈ సీన్స్ షూట్ చేసారు. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ చాలా మంది రావటంతో అక్కడి అధికారులు ప్రత్యేక భధ్రతతో ఈ షూటింగ్ ను ఏర్పాటు చేసారు. ఇక ప్రస్ధానం చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న దర్శకుడు దేవకట్టా కావటంతో మంచి అంచనాలే ఉన్నాయి. మాక్స్ ఇండియా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రానికి నిర్మాత కె.అచ్చిరెడ్డి.నిర్మాత సైతం ఈ చిత్రంపై మంచి కాన్పిడెన్స్ గా ఉన్నారు.
అచ్చిరెడ్డి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ...దేవాకట్టా మంచి కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్న స్టయిలిష్ ఫిలిమ్ ఇది. హీరో క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నాగచైతన్యను పెద్దరేంజ్‌కి తీసుకువెళ్లే ప్రొటెన్షీయాలిటీ ఉన్న కథ ఇది. నిర్మాత వెంకట్‌కు కూడా ఈ కథ నచ్చడంతో చిత్రం నిర్మించడానికి పూనుకున్నాం. హీరో నాగచైతన్య మాట్లాడుతూ దేవాకట్టా చెప్పిన కథ చాలా బాగుంది. నా పాత్ర అద్భుతంగా మలచడానికి ఆయన ప్రయత్నిస్తుండడంతో నేను ఈ చిత్రానికి చేయడానికి పూనుకున్నాను. హీరోగా నాకు మంచి చిత్రం అవుతుంది, అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను అని తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత: కె.అచ్చిరెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవాకట్టా.


Click it and Unblock the Notifications











