twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సూపర్ కార్ షో 2017..వాయువేగంతో నాగ చైతన్య.. రానా మాటలు నిజమవుతాయా?

    By Rajababu
    |

    అక్కినేని వారసుడు నాగచైతన్య మాటలు చాలా నెమ్మదిగా మాట్లాడుతుంటారే గానీ.. కారు స్టీరింగ్ మీద చేయి పడితే వాయువేగంతో దూసుకెళ్లాడు అని ఓ సందర్భంలో ఆయన కారు డ్రైవింగ్ గుట్టును రానా విప్పాడు. రానా చెప్పిన మాట నిజమే అని రుజువు చేసే విధంగా చైతన్య సూపర్ కార్ షో 2017లో పాల్గొననున్నాడు. ఆదివారం హైదరాబాద్‌లో అత్యంత వేగంగా నడిచే (10000 బీహెచ్‌పీఎస్) సూపర్ కార్ల ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నారు. కానన్‌బాల్ క్లబ్ అండ్ కార్ క్రాఫ్ రెండో ఎడిషన్ షో ఆలివ్ బిస్టొ జూబ్లీహిల్స్‌లో ప్రారంభం కానున్నది.

     ఇండియాలోనే పెద్దది..

    ఇండియాలోనే పెద్దది..

    ఫెరారీ, లాండోర్గిని, ఆస్టోన్ మార్టిన్, పోర్సే, మాసెరాటి లాంటి అత్యంత వేగంతో నడిచే కార్ల యజమానులు కానన్‌బాల్‌ క్లబ్‌లో సభ్యులు. ఈ క్లబ్ ఇండియాలోనే అతిపెద్దది.

    కానన్ బాల్ క్లబ్ పర్యవేక్షణలో

    కానన్ బాల్ క్లబ్ పర్యవేక్షణలో

    ఇప్పటివరకు కానన్‌బాల్‌ క్లబ్‌ 75 సూపర్ కార్ ఇవెంట్లను నిర్వహించింది. ఈ ర్యాలీకి ముందు కార్ల డ్రైవర్లకు శిక్షణతో కూడిన సూచనలను కానన్ బాల్ టీమ్ అందజేసింది. నియమ నిబంధనలను పక్కాగా చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

    మితీ మీరిన వేగం.. సందేశాన్ని చెప్పడానికి..

    మితీ మీరిన వేగం.. సందేశాన్ని చెప్పడానికి..

    సూపర్ కారు డ్రైవర్‌గా పాల్గొంటున్న మనోజ్ కాశ్యప్ మాట్లాడుతూ.. సూపర్ కార్ షో 2017లో పాల్గొనడానికి చాలా ఉత్సాహంగా ఉంది. మితిమీరిన వేగం ప్రాణాలకు చేటు అనే సందేశాన్ని చెప్పడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ప్రజలకు మంచి సందేశం వెళ్లే అవకాశం ఉంది అని అన్నారు.

     సూపర్ కార్ డ్రైవర్లకు అవగాహన

    సూపర్ కార్ డ్రైవర్లకు అవగాహన

    సూపర్ కార్ షోను నిర్వహించడం ద్వారా విలాసవంతమైన, హైస్పీడ్ కార్లపై డ్రైవర్లకు అవగాహన ఏర్పడుతుంది. ఇలాంటి ర్యాలీని హైదరాబాద్‌లో నిర్వహించడం రెండోసారి. గతేడాది నిర్వహించిన కార్ల ర్యాలీకి అనూహ్యమైన స్పందన వచ్చింది.

     హైదరాబాద్‌లో రెండోసారి

    హైదరాబాద్‌లో రెండోసారి

    కానన్ ‌బాల్ క్లమ్ వ్యవస్థాపకుడు పరితోష్ గుప్తా మాట్లాడుతూ.. సూపర్ కార్లను డ్రైవ్ చేసే వ్యక్తులకు ఈ ర్యాలీ మంచి ఉత్సాహాన్ని అందిస్తుంది.. హైదరాబాద్‌‌లో రెండోసారి ఈ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ షో ద్వారా హైదరాబాద్‌లో సూపర్ కార్ల వినియోగం పెరుగుతుంది.

     సూపర్ కార్ షో 2017 స్పాన్సర్‌గా

    సూపర్ కార్ షో 2017 స్పాన్సర్‌గా

    సూపర్ కార్ షో 2017కు మహావీర్ మోటార్స్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. మహావీర్ మోటార్స్ హైదరాబాద్‌లో ఏఎంజీ పెర్ఫార్మెన్స్ సెంటర్‌ను నిర్వహిస్తున్నది. ఇలా నిర్వహించే కంపెనీలలో మహవీర్ దేశంలో నాలుగోది. జంట నగరాల్లో ఏకైక సంస్థగా పేరు పొందింది.

    English summary
    Ford Mustang in association with the CannonBall Club and Karr Kraft in associate sponsorship with AMG – Mahavir Group, ATUM, Always Dry and FERRARI MUMBAI today hosted the Hyderabad’s Second edition of Supercar Show 2017. This Sunday in Hyderabad was a special one with over 10,000 bhps roared at the Olive Bistro, Jubilee Hills, Hyderabad.In this event, Naga Chaitanya attended for pre-event session.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X