కెరియర్ టర్నింగ్ లో నాగచైతన్య
నాగచైతన్య కెరియర్ టర్నింగ్ పాయింట్ కు చేరుకుంది. ప్రస్తుతం అతను రామ్ గోపాల్ వర్మ చిత్రం బెజవాడ, ఆటో నగర్ సూర్య చిత్రాల్లో నటిస్తున్నాడు. బెజవాడకు వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకుడు. మరొకటి దేవా కట్టా డైరెక్ట్ చేస్తున్న 'ఆటోనగర్ సూర్య'. ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన నాగచైతన్య రెండు ఫ్లాపులు, రెండు హిట్లతో బేలన్స్‌గా ఉన్నాడు.
తొలి సినిమా 'జోష్', నాలుగో సినిమా 'దడ' ఫ్లాపవగా; రెండు, మూడు సినిమాలైన 'ఏమాయ చేసావె' '100% లవ్' సినిమాలు హిట్టయ్యాయి. అయితే మాస్ హీరోగా మారి జూ. ఎన్టీఆర్, ప్రభాస్ తదితరులు స్థాయికి ఎదుగుదామని ఆశించి చేసిన 'దడ' ప్లాపు కావడంతో ఇప్పడు నాగచైతన్య బెజవాడ, ఆటో నగర్ సూర్య సినిమాల మీదనే పూర్తి ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాల్లో ఏ సినిమా క్లిక్ అయినా తన ఆశించి రేంజ్ కు వెళతాననేది నాగచైతన్య ఆశ.
వీటిలో 'బెజవాడ' సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నవంబర్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదలు పెట్టినప్పట్నించే వార్తల్లో ఉండటం వల్ల అందరి దృష్టీ దీనిపైన ఉంది. ఇక 'ఆటోనగర్ సూర్య' ఇప్పుడే మొదలైంది. ఇందులో చైతన్య, సమంత జంటగా రెండోసారి నటిస్తున్నారు. దేవా కట్టా ప్రతిభావంతుడైన దర్శకునిగా ఇప్పటికే రుజువు చేసుకున్నందున ఈ సినిమా మీద కూడా అంచనాలు బాగానే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











