‘ఆటోనగర్ సూర్య’ రూమర్స్ అబద్దం...?
'ప్రస్థానం" చిత్రం కమర్షియల్ హిట్ కాకపోయినా..దర్శకుడిగా దేవకట్టాకి మాత్రం మంచి పేరునే తెచ్చిపెట్టింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని నాగచైతన్యతో 'ఆటోనగర్ సూర్య" డైరెక్ట్ చేస్తానని చెప్పినప్పటికీ ఆ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. అందుకు నాగచైతన్య 'బెజవాడ" సినిమా షూటింగ్ లో బిజీగా ఉండడం ఒక కారణం అయితే హీరోయిన్ సమంత మరో కారణం.
సమంత 'దూకుడు" సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది. 'దడ" సినిమాతో డీలా పడ్డ నాగచైతన్య 'బెజవాడ" సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. 'దడ" సినిమాతో మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకోవాలనుకున్న నాగచైతన్య ఆ సినిమా రిజల్ట్ తో మాస్ కంటే క్లాసే బెటర్ అని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు చేస్తున్న 'బెజవాడ" సినిమా కూడా మాస్ తరహాలో రావడం ఆ వెనువెంటనే అనుకుంటున్న 'ఆటోనగర్ సూర్య" కూడా బెజవాడ నేపథ్యంతో సాగే మాస్ సినిమా కావడంతో...'దడ"తో దడిచిపోయిన చైతూ ఇంకా ప్రారంభంకాని 'ఆటోనగర్ సూర్య" విషయంలో అనుమానంగా వున్నట్టు తెలుస్తుంది. అటు హీరో ఇటు హీరోయిన్ ఇంకా ఓకే అవ్వకుండానే దేవ కట్టా మాత్రం ఈ సినిమా అక్టోబర్ లో మొదలవుతుందని చెబుతున్నాడు. ఇన్ని ప్రోబ్లమ్స్ ఉన్న ఈ సినిమా ఇప్పట్లో అయితే సెట్స్ పైకి వెళ్ళే అవకాశంలేదు, కాబట్టి దేవ కట్టా మరికొంత కాలం వెయిట్ చేయాల్సింది.
కాగా ఈ రూమర్స్ పై దేవాకట్టా స్పందిస్తూ బిగ్గరగా నవ్వి, సినిమాకు సంబందించిన అన్ని సిద్దంగా ఉన్నాయి. అక్టోబర్ ఆరున షూటింగ్ మొదలు పెడతామని అంటున్నారు. అలాగే నాగచైతన్య దేవాకట్టా మాస్ సినిమా అయినా బెజవాడ, దేవాకట్టా సినిమాకు సంబందం లేదని ఇది పూర్తిగా డిఫరెంట్ మూవీ అంటున్నారు...


Click it and Unblock the Notifications











