twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేస్తున్న బెజవాడ ఆడియో...!

    By Sindhu
    |

    నాగచైతన్య, అమల పాల్ జంటగా నటించిన 'బెజవాడ' సినిమా ఈ నెల 24వ తేదిన విడుదల కాబోతోంది. వివాదాలకు పెట్టింది పేరయిన రామ్ గోపాలవర్మ 'బెజవాడ రౌడీలు' అని పేరు పెట్టి సినిమా మొదలు పెట్టి, తన సినిమాకి కావలసినంత ఫ్రీ పబ్లిసిటీ చేసుకోన్నాక, తన సినిమా టైటిల్ లోంచి రౌడీలను తప్పించి రక్తపాతం మాత్రం ఉందని అంటున్నారు. ఇంత వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా విపరీతమయిన హింస, రక్తపాతం ఉన్నట్లు తెలుస్తోంది.

    నాగచైతన్య వివేక్ కృష్ణ దర్వకత్వంలో రామ్ గాపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా 'బెజవాడ" చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆడియోను ఈ రోజు సాయంత్రం డైరెక్ట్ గా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.

    ఈ విషయాన్ని ఈ చిత్ర యూనిట్ అధికారికంగా ఈ రోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించది. ఈ నెలాఖరున 'బెజవాడ" సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. బెజవాడకు చెందినరెండు వర్గాల పోరును ప్రధాన అంశంగా తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే పలు వివాదాలకు గురైన ఈ చిత్రం విడుదల తర్వాత ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే...

    English summary
    Naga Chaitanya's Bezawada has finalized its release date. The film is being directed by debutant Vivek Krishna and produced jointly by Ram Gopal Varma and Kiran Kumar Koneru. The film is based on local gang wars between two gangs. Earlier, the film was slated for release on November 25, but now the makers advanced it release date by a day to November 24.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X