కత్తెర పడింది: బెజవాడ సెన్సార్ రిపోర్ట్
వివాదాలకు మారుపేరు అయిన రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో రూపొందుతున్న నాగచైతన్య తాజా సినిమా 'బెజవాడ"కు కత్తెర పడింది. తొలుత కొన్ని కత్తెర్లకు సంబంధించి సెన్సార్ బోర్డుకు, దర్శక నిర్మాతలకు మధ్య చిన్నపాటి వివాదం ఏర్పడినప్పటికీ... చివరకు కొన్ని చిన్న చిన్న కత్తెర్లతో సినిమాకు A సర్టిపికెట్ జారీ చేశారు సెన్సార్ బోర్డు వారు. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం బెజవాడ సినిమా ఓ యావరేజ్ సినిమా అని తెలుస్తోంది.
నాగచైతన్య్ర-అమలపాల్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోణేరు సంయుక్తంగా శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించారు. వర్మ శిష్యుడు వివేక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బెజవాడలోని రెండు వర్గాలకు మధ్య జరిగిన గొడవల ఆధారంగా ఈ సినిమా రూపొందించారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ....దర్శక నిర్మాతలు మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











