హింసాత్మకంగా బెజవాడ ట్రైలర్..నాగచైతన్య డైలాగ్స్ కేక

By Bojja Kumar

నాగచైతన్య హీరోగా రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కోనేరు సమయుక్తంగా శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిస్తున్న సినిమా 'బెజవాడ". నాగ చైతన్య సరసన అమలపాల్ హీరోయిన్ గా నటిస్తోంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. ట్రైలర్ మొత్తం భారీ హింసతో నిండుకుని ఉంది. పీకలు కోయడం, సుత్తితో తలలు బద్దలు కొట్టడం, కత్తులతో పొడవటం, గొడ్డళ్లతో నరకడం లాంటి సన్నివేశాతో చిన్న పిల్లలు చూస్తే దడుచుకునేలా ఉందా ట్రైలర్.

'వాడు కొడితే ఎవరైనా పడతారామో..నేను కొడితే పోతారు" అంటూ ఈ ట్రైలర్ లో నాగచైతన్య డైలాగ్ కేక పుట్టించే విధంగా ఉందంటున్నారు అక్కినేని అభిమానులు. ' మన దమ్మెప్పుడు ఒకరిని బయటకు లాగితే పెరగదు..ఒకరిని లోపలికి పంపితే పరుగుతుంది" అంటూ నటుడు ప్రభు డైలాగులు కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ ను చూస్తుంటే పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో హింసాత్మకంగా సినిమాను రూపొందించారని అర్థం అవుతోంది.

బెజవాడలో గతంలో జరిగిన సంఘటనలు తన సినిమాలో చూపించడం లేదని...ఇది పూర్తిగా కల్పిత కథ మాత్రమే అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో బెజవాడ వాసుల ఆందోళన మేరకు 'బజవాడ రౌడీలు" ఉన్న ఈ సినిమా పేరును 'బెజవాడ"గా మార్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X