నాగచైతన్య ‘బెజవాడ’ వాయిదా
రామ్ గోపాల్ వర్మ, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా బెజవాడ. నాగచైతన్య, అమలపాల్ కలిసి రొమాన్స్ చేస్తున్న ఈ సినిమా ఈ రోజు(నవంబర్ 19) సాయంత్రం సెన్సార్ బోర్డు పరిశీలనకు వెలుతోంది. వాస్తవాసికి ఈ సినిమా ఈ నెల 24న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం నవంబర్ 26వ తేదీనికి సినిమా విడుదలను వాయిదా వేసినట్లు సమాచారం. సినిమా స్కిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేసినందునే రెండు రోజులు విడుదల ఆలస్యం అవుతుంది తెలుస్తోంది.
ఈ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ శిష్యుడు వివేక్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ, కిరణ్ కుమార్ కోనేరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెజవాడ రౌడీయిజం ప్రధాన అంశంగా రూపొందిన ఈ సినిమాకు తొలుత 'బెజవాడ రౌడీలు" అనే టైటిల్ పెట్టినప్పటికీ, బెజవాడ వాసుల ఆందోళనతో టైటిల్ నుంచి రౌడీలు అనే పదాన్ని తొలగించి 'బెజవాడ"గా మార్పు చేసిన విషయం తెలిసిందే.
బెజవాడలో గతంలో జరిగిన గొడవలకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ సినిమా స్టోరీ కల్పిత కథ మాత్రమే అని రామ్ గోపాల్ వర్మ చెబుతున్నప్పటికీ....ఈ సినిమాలో బెజవాడ చీకటి చరిత్ర నేపథ్యం ఉంటుందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











