నాగచైతన్య ‘బెజవాడ’ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే...!?
రామ్ గోపాల్ వర్మ సినిమా అనగానే ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూసేవారు కానీ, 'బెజవాడ" సినిమా విషయంలో అలా జరగలేదనిస్పోంది. ఎందుకంటే 'బెజవాడ" సినిమాకి విజయవాడలో తప్ప ..మరి ఎక్కడా క్రేజ్ నెలకొనలేదు.
నాగచైతన్య హీరోగా వివేక్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన బెజవాడ సినిమా గురువారం రోజున విడుదలైంది. ఈ చిత్రం టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుండీ వరుస వివాదాలతో జనాల నోళ్ళలో నానిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వర్మ రక్తచరిత్రలో పరిటాల రవి-సూరిల మద్య జరిగిన కథని చూపించినట్టే ఈ సినిమాలో కూడా దేవినేని నెహ్రో-వంగవీటి రంగల మధ్య ఉన్న వైరాన్ని బేస్ చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారనే సమాచారం జరగడంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఉత్కంట నెలకొంది.
ఇలా భారీ అంచనాల మద్య వచ్చిన ఈ చిత్రం థియేటర్స్ లో తుస్ మనిపించింది. అసలు ఈ కథాంశానికి బెజవాడకి అసలు సంబందం లేకపోవడంతో ఇరు వర్గాల వారు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమా సాదా సీదాగానే ఉందని అంటున్నారు. కథ బాగానే ఉన్నా డైరెక్షన్ కొంచెం వీక్ గా ఉండటంతో ఈ సినిమాకి మైనస్ గా మారింది. మరో రెండు రోజలు గడిస్తే గానీ ఈ చిత్రం స్టామినా ఏంటనేది తెలియదు.


Click it and Unblock the Notifications











