నాగచైతన్య ‘బెజవాడ’ కథేంటి?

By Srikanya

దుర్గమ్మ-కృష్ణమ్మ ఉన్న బెజవాడ ప్రశాంతంగా ఉంటే ఎంత అందంగా కనిపిస్తుందో..కోపంలో అంతటి ప్రళయం సృష్టిస్తుంది. ఇదే బేసిక్‌ లైన్‌.బెజవాడ ఎమోషన్‌తో ముడిపడిన కథ ఇది! టైటిలే ఓ పాత్ర. నాగచైతన్య హీరోయిజాన్ని ఆవిష్కరిస్తుంది. పక్కా కమర్షియల్‌ యాక్షన్‌ సినిమా ఇది అంటున్నారు దర్శకుడు వివేక్ కృష్ణ.అలాగే నాగచైతన్య పాత్ర గురించి చెపుతూ..పద్ధతిగా ఉన్న వ్యవస్థను అనవసరంగా కెలికితే..అది ఓ భూకంపంగానో, సునామీగానో మారే ప్రమాదముందని చెబుతున్నాం.నాగచైతన్య ఆ వ్యవస్ధను కదిపే కుర్రాడుగా కనిపించనున్నాడు అన్నారు.ఇక విజయవాడ అంటే గ్రూపు రాజకీయం, గూండాయిజం ఉంటుంది. దేవినేని ఉమ, నెహ్రూ, -వంగవీటి రంగా, రాధ..ఇలా వర్గాలున్నాయి. అవన్నీ తెరపై చూపించటం లేదన్నారు.

అసలు బెజవాడ రౌడీయిజాని,రాజకీయాలకు- ఈ చిత్రానికి అసలే సంబంధం లేదు. ఓ కుర్రాడికి తన ప్రయాణంలో ఎదురయ్యే వ్యక్తుల వల్ల ఎదురైన ఘర్షణ ఎలాంటిదనేదే సినిమా.ఎవరైనా ఓ వ్యక్తిని హద్దు మీరి హ్యాండిల్‌ చేస్తే..పర్యవసానంగా అతడు ఎలా మారుతాడనే బేసిక్‌ పాయింటు ఆధారంగా కథ నడుస్తుంది అని తేల్చి చెప్పారు.నాగచైతన్య నటిస్తున్న తాజా సినిమా 'బెజవాడ ". అమలాపాల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని రామ్ గోపాల్‌వర్మ, కోనేరు కిరణ్‌కుమార్‌ నిర్మిస్తున్నారు.బెజవాడ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని బెజవాడ సహా హైదరాబాద్‌, స్విట్జర్లాండ్గ, ఇటలీ, ఒమన్‌లలో షూట్ చేసారు.ఆడియో శనివారంనాడు మార్కెట్లోకి రిలీజై మంచి టాక్ తెచ్చుకంది ఈ నెల 24న సినిమా విడుదల సందర్భంగా దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.ప్రమేషన్ లో భాగంగా మీడియాని కలుస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X