బర్త్ డే పార్టీ: గోవాలో ఎంజాయ్ చేస్తున్న చైతన్య-సమంత
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య నేడు 32 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకను సెలబ్రేట్ చేసుకునేందుకు చైతన్య తన భార్య సమంతతో కలిసి గోవా వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో అభిమానులతో పంచుకున్నారు.
గతేడాది అక్టోబర్లో ఈ జంట వివాహం గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ కలిసి ఓ సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. షూటింగ్‌కు నాలుగు రోజులు బ్రేక్ ఇచ్చి చైతు పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఇక్కడికి వచ్చారు.

ఫోటోస్ షేర్ చేసిన సమంత
గోవాలో చైతూ బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను సమంత షేర్ చేశారు. బ్లాక్ డ్రెస్సులో సమంత సూపర్ హాట్ లుక్ తో దర్శనమిచ్చింది.

నాగ చైతన్య-సమంత
నాగ చైతన్య తొలి చిత్రం దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో వచ్చిన జోష్. అయితే 2010లో సమంతతో కలిసి నటించిన ఏమాయ చేశావే మూవీ ద్వారా చైతూ తొలి విజయం అందుకున్నారు. అలా తన జీవితంలోకి వచ్చిన ఆమెతో స్నేహం చేసి, ప్రేమించి జీవిత భాగస్వామిని చేసుకున్నాడు.

మజిలీ
ప్రస్తుతం సమంత, చైతు ‘నిన్ను కోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. 80'స్ నాటి కథతో ఈ మూవీ తెరకెక్కబోతోంది. రైల్వే క్లర్క్ పాత్రలో సమంత, మాజీ క్రికెటర్ పాత్రలో చైతూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ష్యూల్ రెండు రోజుల క్రితమే వైజాగ్‌లో పూర్తయింది.

ఈ వీకెండ్ గోవాలోనే...
సమంత, చైతూ ఈ వీకెండ్ గోవాలోనే గడుపనున్నట్లు సమాచారం. నవంబర్ 26న హైదరాబాద్‌లో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌లో ఇద్దరూ జాయిన్ కాబోతున్నారు.


Click it and Unblock the Notifications











