నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ... అమీర్‌ఖాన్‌తో కలిసి గ్రాండ్‌గా..

అక్కినేని నట వారసుడు నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ఈ యంగ్ హీరో ఇప్పుడు హిందీ సినీ రంగానికి పరిచయం కాబోతున్నారనే వార్త దక్షిణాది మీడియాలో హల్‌చల్ చేసింది. అమీర్‌ఖాన్ రూపొందిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఆ ప్రాజెక్టు వివరాల్లోకి వెళితే...

శాకుంతలగా సమంత అక్కినేని.. గుణశేఖర్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)

ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా

ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా లాల్ సింగ్ చద్దా

బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ స్వయంగా నిర్మాతగానే కాకుండా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న చిత్రం లాల్ సింగ్ చద్దా. 1994లో ఆస్కార్ అవార్డులకు ఎంపికైన ఫారెస్ట్ గంప్ అనే ఈ చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో కరీనాకపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది.

అమీర్ ఖాన్‌కు విజయ్ సేతుపతి గుడ్‌బై

అమీర్ ఖాన్‌కు విజయ్ సేతుపతి గుడ్‌బై

లాల్ సింగ్ చద్దా సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం దక్షిణాది విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ తర్వాత డేట్స్ సమస్య రావడంతో విజయ్ సేతుపతి తప్పుకొన్నారు. అయితే విజయ్ సేతుపతి బరువు పెరిగితే తగ్గించుకోవాలని అమీర్ ఖాన్ చేసిన సూచనకు హర్ట్ అయ్యారని, దాంతో ఆయన సినిమా నుంచి తప్పుకొన్నట్టు వార్తలు వచ్చాయి.

శశి ప్రీరిలీజ్ ఈవెంట్: రానా దగ్గుబాటి, నాగ శౌర్య , సందీప్ కిషన్ హాజరు (ఫొటోలు)

ఆమీర్‌తో అభిప్రాయ బేధాలు లేవంటూ విజయ్ సేతుపతి

ఆమీర్‌తో అభిప్రాయ బేధాలు లేవంటూ విజయ్ సేతుపతి

లాల్‌సింగ్ చద్దా సినిమా నుంచి తప్పుకోవడంపై విజయ్ సేతుపతి కొద్ది రోజుల క్రితం స్పందించారు. అమీర్ ఖాన్‌కు తనకు ఎలాంటి అభిప్రాయబేధాలు లేవు. లాక్‌డౌన్ తర్వాత నా డేట్స్‌ను ఆ సినిమాకు కేటాయించలేని పరిస్థితుల్లో సినిమా నుంచి స్వచ్ఛందంగా తప్పుకొన్నాను అని విజయ్ సేతుపతి అన్నారు.

విజయ్ సేతుపతి పాత్రలో చైతూ

విజయ్ సేతుపతి పాత్రలో చైతూ

ప్రస్తుతం విజయ్ సేతుపతి పాత్రను నాగచైతన్యతో చేయించాలని అమీర్ ఖాన్ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. నాగచైతన్యను మిస్టర్ ఫర్‌ఫెక్ట్ సంప్రదించగా అందుకు చైతూ ఒప్పుకోవడంతో లాల్ సింగ్ చద్దాలో ఆయన నటించడం ఖాయమైంది. మే నెల నుంచి జరిగే షెడ్యూల్‌లో అమీర్ ఖాన్‌తో నాగచైతన్య చేరుతారని వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

మహేష్ బాబు థియేటర్ లో ముగ్గురు జాతిరత్నాలు సందడి: రచ్చరచ్చ చేశారు (ఫొటోలు)

నాగచైతన్య కెరీర్

నాగచైతన్య కెరీర్

నాగచైతన్య కెరీర్ విషయానికి వస్తే.. 2019లో ఆయన నటించిన మజ్లీ, వెంకీ మామ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే ఓ బేబీ చిత్రంలో గెస్ట్‌గా కనిపించారు. లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం ఆయన నటించిన లవ్ స్టోరి చిత్రం రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ బజ్ క్రియేట్ అయింది. అలాగే థ్యాంక్ యూ అనే చిత్రంలో కూడా నటిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X