నాగచైతన్య 'ఒక లైలా కోసం' కాన్సెప్టు ఏంటి

By Srikanya

హైదరాబాద్ : నాగచైతన్య హీరో గా విజయ్‌కుమార్‌ కొండ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్రప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'ఒక లైలా కోసం' అనే పేరుని పరిశీలిస్తున్నారు.

చిత్రం కాన్సెప్టు ను దర్శకుడు చెపుతూ... '' ఒక అమ్మాయి కోసం... ఆమె ప్రేమకోసం అబ్బాయి పడిన కష్టమే ఈ చిత్రం. వినోదాత్మకమైన ప్రేమకథ ఇది. నాగచైతన్య కెరీర్‌లో గుర్తిండిపోయే సినిమాగా తీర్చిదిద్దుతున్నాం. హీరో,హీరోయిన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు వైవిధ్యంగా ఉంటాయి. మార్చి చివరి నాటికి టాకీ పార్టు చిత్రీకరణ పూర్తవుతుంది. ఏప్రిల్‌ మొదటివారంలో విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం''అన్నారు.

దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా మాట్లాడుతూ... ''ఎనిమిది నెలలపాటు శ్రమించి కథను సిద్ధం చేశాం. 'గుండె జారి గల్లంతయ్యిందే' కంటే రెండింతలు ఎక్కువ వినోదం ఉంటుంది. సినిమా చూశాక బంధువుల పెళ్లికి వెళ్లొచ్చిన అనుభూతి కలుగుతుంది. నాగచైతన్యని తెరపై కొత్త తరహాలో చూపించబోతున్నాం''అన్నారు. బ్రహ్మానందం, అలీ, ప్రభు గణేషన్‌, నాజర్‌ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ. ఆండ్రూ, కూర్పు: ప్రవీణ్‌ పూడి. ఈ చిత్రానికి నిర్మాతః నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయకుమార్‌ కొండా.

'తడాఖా'తో మాస్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని మంచి జోష్ మీదున్న నాగచైతన్య... సినిమాలు చేసే విషయంలో కాస్త జోరు పెంచారు. ప్రస్తుతం తన ఫ్యామిలీ సినిమా 'మనం' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు చైతు. దేవా కట్టా దర్శకత్వంలో ఆయన నటించిన 'ఆటోనగర్ సూర్య' చిత్రాన్ని ఈ నెల్లోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలావుంటే... నాగచైతన్య ఇప్పుడు మరో రీమేక్‌ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. పంజాబీలో విజయవంతమైన 'సింగ్‌ వర్సెస్‌ కౌర్‌' చిత్రాన్ని తెలుగులో పునర్నిర్మిస్తున్నారు. అందులో నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తారు. మొదట ఈ చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం సాగింది. అయితే ఈ కథరీత్యా చైతన్య అయితేనే బాగుంటుందని నిర్ణయించారు. వచ్చే నెలలో చిత్రాన్ని ప్రారంభిస్తున్నట్లు నిర్మాత డి.రామానాయుడు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X